పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నూతన 'డ్రోన్ రూల్స్ 2021'కు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతమున్న మాహవ రహిత ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ 2021 స్థానంలో వీటిని తీసుకొచ్చింది. 300 కేజీల నుంచి 500 కేజీల వరకు, హెవీ పేలోడ్‌ను తీసుకెల్లే డ్రోన్లు, డ్రోన్ ట్యాక్సీలకు కలిపి నూతన పాలసీని రూపొందించింది.
కొత్త రూల్స్ డ్రోన్లకు లైసెన్స్, రిజిస్ట్రేషన్‌కు కోసం సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సి అవసరం లేదు. దీనికి సంబంధించి ఫారాలను 25 నుంచి 5కు తగ్గించింది కేంద్రం. అదే విధంగా ఇంతకు ముందు ఉన్న 72 రకాల ఫీజులను 4కు తగ్గించినట్లు వెల్లడించింది.