తెలంగాణ

telangana

By

Published : May 26, 2021, 6:29 PM IST

Updated : May 26, 2021, 6:34 PM IST

ETV Bharat / business

వాట్సాప్​కు కేంద్రం స్ట్రాంగ్​ కౌంటర్​

ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్​కు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చింది కేంద్రం. కొత్త మార్గదర్శకాలను నిరాకరించటం ధిక్కరణ చర్యే అవుతుందని స్పష్టం చేసింది. భారత్​లో నిర్వహించే ఎలాంటి కార్యకలాపాలకు​ అయినా.. దేశంలోని చట్టాలతో సంబంధం ఉంటుందని పేర్కొంది.

WhatsApp
వాట్సాప్​

డిజిటల్​ కంటెంట్​పై నియంత్రణకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన వాట్సాప్​కు మోదీ ప్రభుత్వం గట్టి కౌంటర్​ ఇచ్చింది. కొత్త మార్గదర్శకాలను నిరాకరించటం ధిక్కరణ చర్యే అవుతుందని స్పష్టం చేసింది.

ప్రైవసీ హక్కును భారత ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపింది కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్​ మంత్రిత్వ శాఖ. కొత్త డిజిటల్​ నిబంధనలు సాధారణ కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని పేర్కొంది. మధ్యంతర మార్గదర్శకాలను సవాల్​ చేయటం వాటిని అమలులోకి రాకుండా అడ్డుకునేందుకు చేసిన దురదృష్టకర చర్య అని తెలిపింది.

"ఒకవైపు ప్రైవసీ పాలసీని తప్పనిసరి చేసిన వాట్సాప్​, వినియోగదారుల సమాచారాన్ని తన మాతృ సంస్థ ఫేస్​బుక్​తో పంచుకుంటోంది. మరోవైపు.. తప్పుడు వార్తలు, శాంతిభద్రతలకు సంబంధించి తప్పనిసరైన మార్గదర్శకాలను తిరస్కరించేందుకే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భారత్​లో చేసే ఎలాంటి ఆపరేషన్​ అయినా.. దేశంలోని చట్టాలకు సంబంధం ఉంటుంది. మార్గదర్శకాలను వాట్సాప్​ నిరాకరించటం ధిక్కరణ చర్యే."

- కేంద్ర ఐటీ శాఖ

ఐటీ చట్టం నిబంధనల మేరకు సురక్షితమైన ప్లాట్​ఫాంగా వాట్సాప్​ ఉండాలని స్పష్టం చేసింది కేంద్రం. గోప్యత హక్కుకు విరుద్ధమని కొత్త మార్గదర్శకాలను చిత్రీకరించటానికి వాట్సాప్​ చేసిన ప్రయత్నం తప్పుదారి పట్టించేదేనని పేర్కొంది.

Last Updated : May 26, 2021, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details