ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు నుంచి కొత్త ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా నగదు ఉపసంహరణ, చెక్ బుక్ లీవ్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు సంబంధించిన సేవల ఛార్జీలు ఆగస్టు 1న మారనున్నాయి.
ఆగస్టు నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీల బాదుడు! - ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం ఛార్జీల పెంపు
ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. ఆగస్టు నుంచి బ్యాంక్ సేవలకు సంబంధించిన ఛార్జీల్లో మార్పులు అమలులోకి రానున్నట్లు తెలిపింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. కొత్త ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్
కొత్త ఛార్జీలు ఇలా..
- ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ప్రతి అదనపు లావాదేవీకి రుసుము వసూలు చేస్తారు.
- ఐసీఐసీఐ వినియోగదారులకు 6 మెట్రో నగరాల్లో మొదటి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేతర) సేవలు ఉచితంగా లభిస్తాయి.
- మెట్రో నగరాలు కాకుండా అన్నిఇతర ప్రదేశాలలో మొదటి 5 లావాదేవీలు ఉచితం.
- ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేయనుంది ఐసీఐసీఐ బ్యాంక్.
- హోం బ్రాంచిలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. అది దాటితే ప్రతి రూ.1000కి రూ.5 ఛార్జీ పడుతుంది. కనిష్ఠంగా రూ.150కు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది.
- నాన్ హోం బ్రాంచ్ వద్ద రోజుకు రూ.25,000 వరకు నగదు లావాదేవీలకు ఛార్జీలు లేవు. రూ.25,000 పైన రూ.1000కి రూ.5 ఛార్జీ పడుతుంది. కనీసం రూ. 150కి లోబడి ఉంటుంది.
- థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితి రోజుకు రూ. 25,000గా నిర్ణయించారు. రూ. 25,000 పరిమితి వరకు ప్రతి లావాదేవీకి రూ.150 ఛార్జీ ఉంటుంది. రూ. 25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు అనుమతి లేదు.
- ఒక నెలలో మొదటి 4 లావాదేవీలకు ఛార్జీలుండవు. ఆ తర్వాత రూ.1000 లావాదేవీకి రూ. 5 ఛార్జీ, కనీసం రూ.150కి లోబడి ఉంటుంది.
- ఒక సంవత్సరంలో తీసుకున్న 25 లీవ్స్ చెక్ బుక్‌కి ఛార్జీలు లేవు. ఆ తర్వాత అదే సంవత్సరంలో 10 లీవ్స్ చెక్ బుక్ తీసుకుంటే బ్యాంక్ రూ. 20 వసూలు చేస్తుంది.
ఇదీ చదవండి:ఎయిర్టెల్ షాక్- ఆ ప్లాన్ ధర 60% పెంపు!
Last Updated : Jul 28, 2021, 5:31 PM IST