తెలంగాణ

telangana

ETV Bharat / business

Netflix Subscription Charges: భారీగా తగ్గిన నెట్​ఫ్లిక్స్​ సబ్​స్క్రిప్షన్​ ఛార్జీలు - భారీగా తగ్గిన నెట్​ఫ్లిక్స్​ సబ్​స్క్రిప్షన్​ ఛార్జీలు

Netflix Subscription Charges: అమెరికాకు చెందిన ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ సంస్థ నెట్​ఫ్లిక్స్​ కీలక నిర్ణయం తీసుకుంది. సబ్​స్క్రిప్షన్​ ధరలను భారీగా తగ్గించింది. భారత్​లో వినియోగదారులను పెంచుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు.

Netflix Subscription Charges
నెట్​ఫ్లిక్స్​ సబ్​స్క్రిప్షన్​ ఛార్జీలు

By

Published : Dec 14, 2021, 11:20 AM IST

Updated : Dec 14, 2021, 12:35 PM IST

Netflix Subscription Charges: ఓటీటీ ప్రియులకు నెట్​ఫ్లిక్స్​ ఇండియా గుడ్​ న్యూస్​ చెప్పింది. ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటైన భారత్​లో తన చందాదారులను పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న నెలవారీ చందాల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశంలో మరింత మందికి చేరువకావాలని భావిస్తోంది ఈ సంస్థ.

కేవలం మొబైల్​ ఫోన్​లో నెట్​ఫ్లిక్స్​ సేవలను వినియోగించుకునేందుకు గాను ఉన్న రూ.199 ప్లాన్​ను రూ. 50 మేర తగ్గించింది. తాజా నిర్ణయంతో ఈ ప్లాన్​ ధర రూ. 149కు చేరింది. ఇదే నెట్​ఫ్లిక్స్​లో బేసిక్​ ప్లాన్​గా ఉంది. ఒక డివైజ్​లో అన్ని రకాల కంటెంట్​ను ఈ ప్లాన్​తో యాక్సెస్​ చేసుకోవచ్చని అమెరికాకు చెందిన ఈ ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే నాలుగు స్కీన్​లతో ప్రీమియం ప్లాన్​గా ఉన్న రూ.799 ఇప్పుడు మరింత తగ్గి కేవలం రూ. 649కే రాన్నట్లు సంస్థ తెలిపింది. తగ్గించిన ప్లాన్​ ధరలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయని నెట్​ఫ్లిక్స్ స్పష్టం చేసింది​. దీనితో పాటు నాలుగు డివైజ్​లు యాక్సిస్​ చేసుకునేలా ఉన్న రూ.499 కూడా ఇప్పుడు రూ. 199కే రానున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

'నెట్​ఫ్లిక్స్​లో ఉండే కంటెంట్​ను భారత్​లో ఎక్కువమంది వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే ప్లాన్​ ధరలను మరింతగా తగ్గించాం' అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఓ మీడియా సంస్థతో చెప్పారు.

"నెట్​ఫ్లిక్స్ సరికొత్త, విభిన్నమైన కంటెంట్​ను చందాదారులకు అందిస్తుంది. కంటెంట్​ ఎక్కువ మందిని చేరుకునేందుకు ఇప్పటికే డబ్బింగ్, సబ్‌ టైటిల్స్​తో ఇస్తున్నాం. పెద్ద మొత్తంలో ఆడియన్స్​ను చేరుకోవడమే లక్ష్యంగా సినిమాలు, సిరీస్‌లను తీసుకొస్తున్నాం. కరోనా సమయంలో ఏడాదిన్నర కాలంగా భారత్​ నుంచి ఎక్కువ మంది నెట్​ఫ్లిక్స్​ను మంచి ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ ప్లాట్​ ఫాంగా ఎంచుకున్నారు."

- మోనికా షెర్గిల్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్

ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్​ సేవలను వినియోగించుకుంటున్న చందాదారులు మరిన్ని సేవలకు అప్​గ్రేడ్​ అయ్యే అవకాశం ఉందని మోనికా షెర్గిల్​ అన్నారు.

ఇటీవల అమెజాన్​ ప్రైమ్​ ధరలు భారీగా పెంచింది. వార్షిక చందాను సమారు రూ.500 మేర పెంచింది. నెట్​ఫ్లిక్ మాత్రం ధరలు తగ్గించింది.

ఇవీ చూడండి:

Infinix Note 11: తక్కువ ధరకు అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు

జోరుగా ఆన్‌లైన్‌ నియామకాలు- అభ్యర్థుల ఎంపికలో మారిన తీరు

Last Updated : Dec 14, 2021, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details