తెలంగాణ

telangana

ETV Bharat / business

Q1 Results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 7729 కోట్లు - హెచ్​డీఎఫ్​సీ

ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంక్​ హెచ్​డీఎఫ్​సీ లాభాల పంట పండించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 16.1 శాతం పెరిగి రూ.7,729.6 కోట్లుగా నమోదైంది. అయితే.. క్రితం త్రైమాసికంతో పోలిస్తే నికర లాభంలో 6.5 శాతం క్షీణత కనిపించింది.

HDFC Bank
హెచ్​డీఎఫ్​సీ

By

Published : Jul 18, 2021, 4:32 AM IST

Updated : Jul 18, 2021, 4:37 AM IST

దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 16.1 శాతం పెరిగి రూ.7,729.6 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంకు నికరలాభం రూ.6,658.6 కోట్లుగా ఉంది. అయితే, క్రితం త్రైమాసికంతో పోలిస్తే నికర లాభంలో 6.5 శాతం క్షీణత కనిపించింది. నికర వడ్డీ ఆదాయం కూడా 8.57 శాతం పెరిగి రూ.17,009 కోట్లకు చేరింది. బ్యాంక్‌ నికర ఆదాయం 18 శాతం పెరిగి రూ.23,297.5 కోట్లుగా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం 54.3 శాతం పెరిగి రూ.6228.5 కోట్లుగా రికార్డయింది.

స్థూల నిరర్ధక ఆస్తులు 1.32 శాతం (డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో) నుంచి 1.47 శాతానికి పెరిగాయి. కరోనా రెండో దశ ప్రభావం బ్యాంకు కార్యకలాపాలపై పడిందని ఓ ప్రకటనలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది.

ఇదీ చదవండి:పోస్టాఫీస్​ పథకాలతో రిస్క్​ లేని ఆదాయం!

Last Updated : Jul 18, 2021, 4:37 AM IST

ABOUT THE AUTHOR

...view details