2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ.. నిరక ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపు వృద్ధిని సాధించినట్లు కేంద్ర ప్రకటించింది. మొత్తం రూ.1.85 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీడీ) ప్రకటించింది.
మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ల వాటా రూ. 74,356 కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్నులు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) ద్వారా మరో రూ. 1.11 లక్షల కోట్లు వచ్చినట్లు పేర్కొంది.
ఏప్రిల్ 1-జూన్ 15 మధ్య నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 1,85,871 కోట్లగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇప్పటి వసూళ్లు 100.4 శాతం పెరిగాయని సీబీటీడీ పేర్కొంది.
అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు జూన్ త్రైమాసికంలో 146 శాతం పెరిగినట్లు సీబీటీడీ తెలిపింది. దీంతో రూ.28,780 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరినట్లు పేర్కొంది. అంతేగాక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం రూ. 30,731 కోట్లు రీఫండ్ చేసినట్లు వివరించింది.
ఇదీ చూడండి:కారు, పెళ్లి, రిటైర్మెంట్.. వీటికి ఏ పెట్టుబడులు బెటర్?