కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమన పరిస్థితి ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెట్టేసింది. చాలా మందికి ఆదాయాలు తగ్గిపోయాయి. ఉద్యోగాల కోతను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఉండే ఇబ్బందుల దృష్ట్యా.. రిజర్వు బ్యాంకు ఏకకాల పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించింది.
ఇది చాలా ముందికి.. ముఖ్యంగా తక్కువ మొత్తం రుణం తీసుకొని, కొవిడ్ వల్ల ఆదాయాలు తగ్గిపోయిన వారికి చాలా మందికి ఊరట కలిగించే పరిణామంగా ఉంది. విద్య, గృహ, వాహనాలు, వ్యక్తిగత, బంగారంపై రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు తదితర రిటైల్ రుణాలపై పునర్‌వ్యవస్థీకరణ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి షరతులు, నిబంధనలను తెలుసుకోవటం చాలా ముఖ్యం.
రుణ పునర్‌వ్యవస్థీకరణ చేయించుకోవాలనుకునే వారు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను యాస్క్‌క్రెడ్.ఏఐ సీఈఓ ఆర్తీ కన్నా ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
పునర్‌వ్యవస్థీకరణ అంటే ఏమిటి?
రుణానికి సంబంధించి తిరిగి చెల్లింపుల గడువు, తీరులో మార్పులు చేసేందుకు వీలుగా సంస్థతో కాంట్రాక్టును మార్చుకోవటమే పునర్‌వ్యవస్థీకరణ. ఈఎమ్‌ఐని వాయిదా వేసుకోవటం, మొత్తం రుణం గడువును పెంచుకోవటం తదితర ఆప్షన్లు ఇందులో ఉంటాయి.
ఎందుకు ఈ పునర్‌వ్యవస్థీకరణ?
కొవిడ్ మహమ్మారి వల్ల తీవ్ర ప్రభావం పడి, రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం తగ్గిపోయినవారిని ఆదుకునేందుకు రిజర్వు బ్యాంకు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. పునర్‌వ్యవస్థీకరణ జరిగిన రుణాలు నిరర్ధక ఆస్తులు, మొండి బాకీలుగా మారవు. దీని వల్ల బ్యాంకు బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి పెరగదు. కాబట్టి రుణ ఇచ్చిన సంస్థలు, బ్యాంకులు కూడా పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ప్రయోజనం పొందుతాయి.
ఎవరు దీనికి అర్హులు?
2020 మార్చి 1 వరకు 30 రోజుల కంటే ఎక్కువ డీఫాల్ట్ లేకుండా, స్టాండర్ట్‌గా ఉన్న రుణ ఖాతాలు మాత్రమే పునర్‌వ్యవస్థీకరణ చేసుకోవచ్చు. మార్చి 1 కంటే ముందు రుణం డీఫాల్ట్ చేసినట్లైతే పునర్‌వ్యవస్థీకరణ చేసుకోరాదు. కొవిడ్ వల్ల ఆదాయం తగ్గిపోయిందని రుణ స్వీకర్త నిరూపించాలి.
ఎలాంటి ఆప్షన్లు ఉన్నాయి?
తిరిగి చెల్లించే కాలాన్ని రీషెడ్యూల్ చేయవచ్చు. జమ అయిన గతంలో లేదా భవిష్యత్ వడ్డీకి సంబంధించిన మొత్తాన్ని మరో రుణంగా మార్చుకోవచ్చు. లేదా రెండేళ్ల వరకు మారటోరియానికి అవకాశం(ఈఎంఐ పేమెంట్ హాలిడే అని కూడా అంటారు) ఇవ్వవచ్చు.
చెల్లించే మొత్తం పెరుగుతుందా?
పునర్‌వ్యవస్థీకరణ జరిగిన రుణాలకు సంబంధించి తిరిగి చెల్లించేందుకు మారటోరియం ఉండవచ్చు. దీనితో పెరిగిన కాలానికి కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా రుణంపై చెల్లించే మొత్తం పెరుగుతుంది.
పునర్ వ్యవస్థీకరణకు సాధారణంగా రుణంలో కొంత భాగం ఛార్జీలు ఉంటాయి. ఈ రుణాలపై కంటే వడ్డీ రేటు ప్రస్తుత రుణం కంటే ఎక్కువగా ఉంటుంది.
ఇలా ఎన్ని చేసుకోవచ్చు?