తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆర్థిక వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరం' - బడ్జెట్​ 2019

ముద్ర, ఆయుష్మాన్​ భారత్​ వంటి పథకాలతో ఐదేళ్లలో సామాన్యుడి జీవితం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. భారత్​ తలపెట్టిన 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని ఛేదించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

'ఆర్థిక వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరం'

By

Published : Jul 5, 2019, 11:51 AM IST

Updated : Jul 5, 2019, 12:00 PM IST

'ఆర్థిక వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరం'

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్​ అవతరిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ పునరుద్ఘాటించారు. పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టిన నిర్మల... ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్​లో ఎన్నో సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. 5 ట్రిలియన్​ డాలర్ల లక్ష్యాన్ని ఛేదించడానికి మరిన్ని మార్పులు అవసరమన్నారు నిర్మల. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ 1.85 ట్రిలియన్​గా ఉండేదని... ఇప్పుడది 2.7 ట్రిలియన్​కు చేరిందని వెల్లడించారు.

ఐదేళ్లలో ప్రభుత్వ పథకాలతో సామాన్యుడి జీవితం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

ఇదీ చూడండి:- 'పీతల వల్లే తివారె ఆనకట్ట​కు గండి'

Last Updated : Jul 5, 2019, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details