తెలంగాణ

telangana

ETV Bharat / business

గ్యాస్​ కనెక్షన్​ కావాలా? ఒక్క మిస్డ్​కాల్​ ఇవ్వండి

కొత్త వంట గ్యాస్ కనెక్షన్‌ కోసం ఇకపై ఇంధన సంస్థ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. ఒక్క నెంబరుకు మిస్డ్​కాల్​ ఇవ్వడం ద్వారా కొత్త ఎల్​పీజీ కనెక్షన్ పొందే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

lpg connection
ఐఓసీ

By

Published : Aug 10, 2021, 4:48 AM IST

దేశంలో అతిపెద్ద ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. కొత్త ఇండేన్ వంట గ్యాస్ కనెక్షన్‌ కోసం.. 84549-55555 నెంబరుకు మిస్డ్‌ కాల్ ఇవ్వడం ద్వారా నమోదు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ప్రస్తుత వినియోగదారులు నమోదిత ఫోన్‌నెంబర్ నుంచి ఈ నెంబరుకు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

దేశంలో ఎక్కడైనా మిస్డ్‌కాల్‌తో కొత్త ఎల్​పీజీ కనెక్షన్ పొందే సౌకర్యాన్ని ఐఓసీ ఛైర్మన్ ఎస్​ఎం వైద్య సోమవారం ప్రారంభించారు. వినియోగదారుడి ఇంటి వద్దే రెండో సిలిండర్ పొందే సదుపాయాన్ని మొదలు పెట్టారు. ఒకే సిలిండర్ కలిగిన వినియోగదారులు రెండింటికి మారే అవకాశాన్ని డెలివరీ సిబ్బంది కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వినియోగదారులు సాధారణ 14.2 కిలోల సిలిండర్‌కు బదులు 5 కిలోల సిలిండర్‌ను సైతం ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం కల్పిస్తున్న ఏకైక చమురు మార్కెటింగ్ కంపెనీగా ఐఓసీ ఉంది.

ఇదీ చూడండి:గ్యాస్ సిలిండర్లు నీటిలో విసిరి నిరసన

ABOUT THE AUTHOR

...view details