తెలంగాణ

telangana

ETV Bharat / business

విద్యుత్ రంగంలో కరోనాకు వెయ్యి మంది బలి - విద్యుత్​ ఉద్యోగులకు టీకాలో ప్రధాన్యత కోసం ఏఐపీఈఎఫ్​ డిమాండ్

దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో ఇప్పటి వరకు 1000 మందికి పైగా ఉద్యోగులు కరోనాతో మృతి చెందినట్లు ఆల్​ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగ ఉద్యోగులకు వ్యాక్సినేషన్​లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసింది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారంగా ఇవ్వాలని కోరింది.

Corona cases in power sector
విద్యుత్ రంగంలో కరోనా కోరలు

By

Published : May 14, 2021, 4:31 PM IST

విద్యుత్​ రంగంలో ఇప్పటి వరకు 1000 మంది కరోనాతో మృతి చెందారని ఆల్​ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్​ (ఏఐపీఈఎఫ్​) శుక్రవారం ప్రకటించింది. మొత్తం 15 వేలకుపైగా సిబ్బంది వైరస్​ బారిన పడినట్లు పేర్కొంది.

మహారాష్ట్రలో అత్యధికం..

మహారాష్ట్రలో అత్యధికంగా 210 మంది విద్యుత్ రంగ ఉద్యోగులు కరోనాతో మృతి చెందగా.. 7,100 మందికి పాజిటివ్​గా తేలింది. ఉత్తర్​ప్రదేశ్​లో 4 వేల మందికి కరోనా సోకగా.. 140 మంది మహమ్మారికి బలయ్యారు.

ప్రధానికి లేఖ..

కేసులు, మృతులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్​ రంగ ఉద్యోగులకు టీకా ప్రక్రియలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని రాష్ట్రాల్లో ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్​ కె సింగ్​కు లేఖ రాసింది ఏఐపీఈఎఫ్​.

దీనితో పాటు కరోనా వల్ల మృతి చెందిన విద్యుత్​ రంగ ఉద్యోగులందరికీ రూ.50 లక్షలు పరిహారంగా ఇవ్వాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది.

ఎన్​టీపీసీ, పవర్​ గ్రిడ్​ వంటి సంస్థలు ఇప్పటికే వారి ఉద్యోగుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్​ శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి:2020-21లో డాక్టర్​ రెడ్డీస్​ లాభం రూ.1,952 కోట్లు

ABOUT THE AUTHOR

...view details