తెలంగాణ

telangana

ETV Bharat / business

ఓఎన్‌జీసీ ఆదాయాల్లో భారీ కోత! - సహజ వాయువు ధరల్లో భారీ క్షీణత

సహజ వాయువు ధరల్లో భారీ క్షీణతతో సీఎన్​జీ, గొట్టపు మార్గం ద్వారా అందించే వంట గ్యాస్​ ధరలు తగ్గనున్నాయి. ఈ చర్యతో వంట గ్యాస్​ తయారుదారులైన ఓఎన్​జీసీ సంస్థల ఆదాయాల్లో భారీగా కోత పడనుంది.

ONGC revenues
ఓఎన్‌జీసీ ఆదాయాల్లో భారీ కోత!

By

Published : Apr 1, 2020, 5:38 AM IST

సహజ వాయువు ధరలు మంగళవారం 26 శాతం తగ్గాయి. 2014లో ఫార్ములా ఆధారిత ధరల విధానాన్ని ప్రారంభించిన తర్వాత ఇదే అత్యధిక క్షీణత కావడం గమనార్హం. దీని వల్ల సీఎన్‌జీ, గొట్టపు మార్గం ద్వారా అందించే వంట గ్యాస్‌ ధరలు తగ్గుతాయి. ఓఎన్‌జీసీ గ్యాస్‌ తయారుదారు ఆదాయాల్లో భారీ కోత పడనుంది.

ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే ఆరు నెలల కాలానికి గ్యాస్‌ ఉత్పత్తి ధర మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు 2.39 డాలర్ల వద్ద లెక్కగడతారు. ప్రస్తుతం ఇది 3.23 డాలర్లుగా ఉంది. కాగా, డీప్‌సీ వంటి సంక్లిష్ట క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ ధర(ఎంఎంబీటీయూ) సైతం 8.43 డాలర్ల నుంచి 5.61 డాలర్లకు పరిమితమైంది. చివరిసారిగా అక్టోబరు 1న సహజ వాయువు ధరను 12.5 శాతం మేర తగ్గించి 3.69 డాలర్ల నుంచి 3.23 డాలర్లకు చేర్చారు.

ఈ ధరల కోత వల్ల ఓఎన్‌జీసీ ఆదాయాలు రూ.3,000 కోట్ల వరకు తగ్గవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:దేశం​లో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details