కొన్ని రకాల కేన్సర్ వ్యాధులను అదుపు చేసేందుకు వినియోగించే లెనలిడోమైడ్ జనరిక్ ఔషధాన్ని అమెరికా విపణిలో విడుదల చేసేందుకు నాట్కో ఫార్మా అనుమతి సంపాదించింది. 5ఎంజీ, 10ఎంజీ, 15ఎంజీ, 25ఎంజీ డోసుల్లో ఈ ఔషధాన్ని విక్రయించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తుది అనుమతి ఇచ్చింది. దీనికి మూడేళ్ల క్రితమే తాత్కాలిక అనుమతి రాగా, తుది అనుమతి కోసం ఎదురుచూస్తుంది.
లెనలిడోమైడ్ ఔషధంపై పేటెంట్ హక్కులు అమెరికాకు చెందిన సెల్‌జీన్ (బ్రిస్టల్-మేర్స్ స్క్విబ్‌కు అనుబంధ సంస్థ) అనే కంపెనీకి ఉన్నాయి. దీన్ని 'రెవ్‌లీమిడ్' బ్రాండు పేరుతో ఆ సంస్థ విక్రయిస్తోంది. సెల్‌జీన్‌తో పేటెంట్ వివాదాన్ని (పారా-4 లిటిగేషన్) నాట్కో ఫార్మా గతంలోనే పరిష్కరించుకుంది. దీని ప్రకారం 2022 మార్చి నుంచి అమెరికాలో లెనలిడోమైడ్ జనరిక్ ఔషధాన్ని విక్రయించవచ్చు. దీనికి సంబంధించి 6 నెలల ప్రత్యేక మార్కెటింగ్ హక్కులు కూడా నాట్కో ఫార్మాకు ఉన్నాయి. అంటే ఆరు నెలల పాటు సెల్‌జీన్, నాట్కో ఫార్మా మినహా మరొక కంపెనీ అమెరికాలో ఈ ఔషధాన్ని విక్రయించడానికి వీల్లేదు.
ఈ నేపథ్యంలో తన మార్కెటింగ్ భాగస్వామి అయిన ఆరో ఇంటర్నేషనల్ లిమిటెడ్ (తెవా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ) ద్వారా అమెరికాలో విక్రయాలు చేపట్టేందుకు నాట్కో ఫార్మా సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇదే ఔషధాన్ని కెనడాలోనూ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇంతటి ప్రాధాన్యం