మర్చెంట్ డిస్కౌంట్ ఛార్జీలు ప్రభుత్వ జోక్యం లేకుండానే జీరో కావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని సూచించారు. ప్రభుత్వం జోక్యం లేకపోయినా.. దేశీయ పేమెంట్ సంస్థలు చౌక చెల్లింపు విధానాలపై దృష్టిపెట్టాలన్నారు. ఇవి చిరువ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.
"ఎండీఆర్ ఛార్జీలు పూర్తిగా తొలగిస్తారని అనుకుంటున్నాను. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయినా ఇది జరగాలి. ఆన్‌లైన్‌లోనే కాదు.. ఆఫ్‌లైన్‌లో కూడా చౌకగా చెల్లింపులు జరిగేలా చూడాలి. అప్పులు ఇవ్వడం వంటి ఇతర మార్గాల్లో ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. యూపీఐని తప్పనిసరి చేయడం ఉత్తమమైన మార్గమని అనుకుంటున్నాను. యూపీఐ విషయంలో ఆకాశమే హద్దు.''