తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2021, 5:34 AM IST

ETV Bharat / business

'మౌలిక సదుపాయాల కోసం రూ. 16వేల కోట్లు మంజూరు'

ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి 10 నెలల్లో గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం రూ. 16వేల కోట్లు మంజూరు చేసినట్టు నాబార్డ్​ ప్రకటించింది. ఆర్​ఐడీఎఫ్​ కింద ఈ కేటాయింపులు చేసినట్టు పేర్కొంది.

nabard-disburses-rs-16500-crore-under-ridf-in-first-10-months-of-fy21
'మౌలిక సదుపాయాల కోసం రూ. 16వేల కోట్లు మంజూరు'

గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్​ఐడీఎఫ్​) కింద.. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ. 16వేల 500కోట్లు పంపిణీ చేసినట్లు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు) వెల్లడించింది. ఆర్​ఐడీఎఫ్​కు రూ. 30వేల 200కోట్లు మంజూరు చేశామని.. అందులో ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో మొదటి 10నెలలకు రూ. 16వేల 500కోట్లు మంజూరు చేశామని నాబార్డ్ వెల్లడించింది.

గ్రామాల్లో సామాజిక ఆస్తులు సృష్టించేందుకు 1995లో ఆర్​ఐడీఎఫ్​ను స్థాపించారు. ఇజి ప్రారంభమైనప్పటి నుంచి వివిధ గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు.. నాబార్డ్‌ రూ. 3లక్షల 11 వేల కోట్లు పంపిణీ చేసిందని నాబార్డ్ చైర్మన్ జి.ఆర్. చింతల వెల్లడించారు.

2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఆర్​ఐడీఎఫ్​ కేటాయింపులను రూ. 30వేల కోట్ల నుంచి రూ. 40వేల కోట్లకు పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్‌లో కేటాయింపుల పెంపు.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు మరింత దోహదపడుతుందని చింతల పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-'హరిత పన్ను, తుక్కు విధానంతో ఇద్దరికీ లాభం'

ABOUT THE AUTHOR

...view details