తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా గ్రూప్​కు​ ఎయిర్​ఇండియాను అప్పగించిన కేంద్రం - business news today

Air India to Tata Group: ఎయిరిండియాను టాటా గ్రూప్​ చేతికి అప్పగించింది అప్పగించింది కేంద్రం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రక్రియ పూర్తి చేసింది. అంతకుముందు టాటా సన్స్ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖర్​తో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ.

Air India to Tata Group
టాటా సన్స్ ఛైర్మన్​తో ప్రధాని మోదీ భేటీ

By

Published : Jan 27, 2022, 3:17 PM IST

Updated : Jan 27, 2022, 5:23 PM IST

Air India to Tata Group: ఎయిర్​ఇండియాను టాటా గ్రూప్​ చేతికి అప్పగించింది కేంద్రం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను పూర్తి చేసింది. ఎయిర్​ఇండియాలోని 100శాతం వాటాను టాటా గ్రూప్​కు చెందిన లాటెస్​ ప్రైవేట్ లిమిటెడ్​కు బదిలీ చేసింది. ఇకపై ఎయిర్​ఇండియా నిర్వహణ, నియంత్రణ పూర్తిగా టాటా గ్రూప్​ చేతిలోనే ఉండనుంది. అప్పగింత అనంతరం ఎయిర్​ఇండియాకు కొత్త బోర్డును కూడా నియమించింది టాటా గ్రూప్​. పాత బోర్డు గురువారం ఉదయమే రాజీనామా చేసింది. శుక్రవారం నుంచి టాటా గ్రూప్​ ఆధ్వర్యంలోనే ఎయిర్​ఇండియా కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

టాటా గ్రూప్​కు​ ఎయిర్​ఇండియాను అప్పగించిన కేంద్రం
టాటా గ్రూప్​కు​ ఎయిర్​ఇండియాను అప్పగించిన కేంద్రం

ఈ ఒప్పందం పూర్తి కావడంపై టాటా సన్స్ ఛైర్మన్​ ఎన్ చంద్ర శేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో ఎయిర్​ఇండియాను ప్రపంచ శ్రేణి సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి సంస్కరణల పట్ల నిబద్ధత, భారత పారిశ్రామిక స్ఫూర్తి పట్ల విశ్వాసం వల్లే ఇంత పెద్ద ఒప్పందం సాధ్యమయ్యిందని టాటా గ్రూప్ ప్రకటనలో తెలిపింది. ఎయిర్​ ఇండియా అప్పగింతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు చంద్రశేఖర్​.

టాటా సన్స్ ఛైర్మన్​తో ప్రధాని మోదీ భేటీ

Air India Handover

ఎయిరిండియా దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి టాటాల చేతికి వెళ్లింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించింది. టాటా అనుబంధ సంస్థ టాలెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అత్యధికంగా 18 వేల కోట్లకు బిడ్డింగ్‌ వేసి ఎయిరిండియాను తిరిగి దక్కించుకుంది. విక్రయ ఒప్పందానికి గతేడాది అక్టోబరు 8న ఆమోదం తెలిపిన కేంద్రం ఆ తర్వాత 3 రోజులకు అంగీకారం తెలుపుతూ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేసింది. అక్టోబరు 25 న విక్రయం ఒప్పందంపై సంతకం చేసిన కేంద్రం.. టాటాలకు అప్పగించేందుకు లాంఛనాలన్నీ పూర్తి చేసింది.

Air India TATA

ఒప్పందంలో భాగంగా ఎయిరిండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలు అందించే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, ఎయిరిండియా శాట్స్ లో 50శాతం వాటా కూడా టాటా గ్రూప్​కు అందజేసింది కేంద్రం. ఎయిరిండియా కొనుగోలుతో టాటాగ్రూప్​ లో మూడో విమానయాన సంస్థగా అవతరించనుంది. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియాలో టాటాలకు మెజారిటీ వాటాలున్నాయి. ఎయిరిండియా నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేయాలనే ఆలోచనతో టాటా గ్రూప్‌ ఉన్నట్లు సమాచారం.

89ఏళ్లక్రితం 1932 లో జేఆర్​డీ టాటా.... టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ ప్రారంభించారు. 1953లో జాతీయకరణలో భాగంగా టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవటంతో ఎయిరిండియాగా మారింది. విమానయాన రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించాక ఎయిరిండియా క్రమంగా తన మార్కును కోల్పోవటం మొదలైంది. 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అనంతరం నష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా విక్రయానికి ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించగా టాటాలు దక్కించుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:టెస్లాకు భారీ లాభాలు.. కొత్త ఫ్యాక్టరీలకు రంగం సిద్ధం!

Last Updated : Jan 27, 2022, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details