తెలంగాణ

telangana

ETV Bharat / business

మీకు తెలుసా... రతన్‌ టాటాకూ ఉందో లవ్‌స్టోరీ..! - Ratan Tata

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా పెళ్లి చేసుకోలేదనే విషయం చాలా మందికి తెలిసిన విషయమే... కానీ ఆయనకు కూడా లవ్​స్టోరీ ఉందన్న సంగతీ చాలా మందికి తెలియదు. ఈ విషయం గురించి ఎప్పుడు ప్రస్తావించలేదు టాటా. తాజాగా తన లవ్​స్టోరీ గురించి ఓ ప్రముఖ ఫేస్​బుక్​ పేజీతో ప్రస్తావించిన ఆయన ఇంకా మరెన్నే ఆసక్తికర విషయాలు గురించి చెప్పుకొచ్చారు. మరి వాటి గురించి మనమూ తెలుసుకుందామా..!

My marriage called off due to Indo-China war: Ratan Tata
మీకూ తెలుసా... రతన్‌ తాతకూ ఉందో లవ్‌స్టోరీ..!

By

Published : Feb 13, 2020, 9:24 PM IST

Updated : Mar 1, 2020, 6:16 AM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా పెళ్లి చేసుకోలేదనే విషయం అందరికీ తెలిసిందే. దానికి గల కారణాలను ఆయన ఎప్పుడూ బయట ప్రస్తావించలేదు. అయితే ఆయన లాస్‌ ఏంజెలెస్‌లో కాలేజ్‌ గ్రాడ్యుయేట్‌గా ఉన్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారట. తాజాగా ఆయన ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బొంబే’ అనే ఫేస్‌బుక్‌ పేజీతో ఈ విషయాన్ని పంచుకున్నారు. తన జీవితానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలనూ వెల్లడించారు.

అమ్మమ్మ నేర్పిన విలువలు..

చిన్నతనంలో తాను ఎంతో సంతోషకరమైన బాల్యాన్ని గడిపినట్లు రతన్‌ టాటా తెలిపారు. అయితే, రతన్‌ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటాలు ఆయన పదేళ్ల వయసులోనే విడిపోయారు. తర్వాత ఆయన అమ్మమ్మ నవాజ్‌బాయ్‌ టాటా వద్ద పెరిగారు. ఈ సందర్భంగా ఆమె నేర్పిన విలువలను రతన్‌ టాటా గుర్తుచేసుకున్నారు. ‘‘నాకు ఇప్పటికీ గుర్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నేను, నా సోదరుడితో కలిసి వేసవి సెలవులు గడిపేందుకు లండన్‌ వెళ్లాం. అప్పుడే మాకు విలువలు గురించి తెలిసింది. మా అమ్మమ్మ మాతో వేటి గురించి మాట్లాడాలో, ఎటువంటివి విషయాలు మాట్లడకూడదో చెప్పేది. అప్పుడే మా మనస్సుల్లో అన్నింటికి మించిన గౌరవం ఏర్పడింది’’ అని చెప్పుకొచ్చారు.

అమ్మమ్మతో టాటా

గత స్మృుతులు...

అంతేకాకుండా తన తండ్రితో విభేందించిన సందర్భాలను కూడా రతన్ టాటా గుర్తుచేసుకున్నారు. ‘‘నాకు వయోలిన్‌ వాయించడం నేర్చుకోవాలనుకునేవాడిని. కానీ మా నాన్న మాత్రం నన్ను పియానో నేర్చుకోవాలని చెప్పేవారు. నేను అమెరికాలో చదవాలనుకుంటే ఆయన నన్ను బ్రిటన్‌లో చదవాలని సూచించేవారు. నేను ఆర్కిటెక్ట్‌ కావాలనుకుంటే ఆయన నన్ను ఇంజనీర్ అవ్వాలనేవారు’’ అని తెలిపారు. తర్వాతి కాలంలో రతన్‌ టాటా తన కోరిక మేరకు అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఆర్కిటెక్ట్ విద్యనభ్యసించారు. ఇందుకు తన అమ్మమ్మకు కృతజ్ఞతలు తెలపాలంటారాయన. ఈ విషయంలో తన తండ్రి ఒకింత అసంతృప్తికి గురయ్యారట. అనంతరం లాస్‌ ఏంజెలెస్‌లో రెండు ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. ‘‘అప్పుడు అది గొప్ప సమయం, వాతావరణం కూడా ఎంతో అందంగా ఉండేది. నాకు సొంత కారు ఉండేది. నా ఉద్యోగాన్ని నేను ఎంతో ఇష్టపడ్డాను’’ అని ఆనాటి రోజుల్ని రతన్‌ టాటా గుర్తుచేసుకున్నారు.

పుస్తక పఠనం చేస్తున్న టాటా

లవ్​స్టోరీ...

ఆ సమయంలోనే ఓ మహిళను రతన్‌టాటా ప్రేమించారు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అమ్మమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఆయన భారత్‌కు వచ్చేశారు. తను ప్రేమించిన అమ్మాయి కూడా తనతో పాటు భారత్‌కు వస్తుందని భావించారట. 1962 భారత్‌-చైనా యుద్ధం కారణంగా ఆమెను పంపడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదట. అలా అక్కడితో వారి మధ్య బంధం కూడా ముగిసిపోయిందని రతన్‌ టాటా చెప్పారు.

వైరల్​...

ఆయన గురించిన ఆసక్తికర విషయాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన కొద్దిసేపటికే నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ‘దేశం కోసం మీ కుటుంబం ఎంతో చేసింది’, ‘దేశం మీ గురించి మరింత తెలుసుకోవాలనుకొంటోంది’, ‘గొప్ప వ్యక్తి, ఆయన గురించి మరింత చదవాలనుకుంటున్నాం’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చూడండి:కరోనా: కేరళ విద్యార్థిని సేఫ్​.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

Last Updated : Mar 1, 2020, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details