తెలంగాణ

telangana

ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? - mutual funds latest news

ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మంచి అవకాశం మ్యూచువల్‌ ఫండ్స్​ . నెల నెలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సిప్‌ లాంటి సదుపాయాలు వాటిలో ఉందుబాటులో ఉంటాయి. చాలా మంది మ్యూచువల్‌ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. ఏ విధంగా ప్రీమియం చెల్లించాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే అందుకోసం చాలా మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

mutual funds investment ways
మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?

By

Published : Aug 8, 2020, 12:28 PM IST

భవిష్యత్తులో మంచి రిటర్న్స్‌ పొందేందుకు చాలా మంది మ్యూచువల్‌ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు.నెల నెలా కొంచెం మొత్తంలో వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. అందుకు అనేక మార్గాలున్నాయి. ఇందుకోసం పూర్తిగా ఆన్‌లైన్‌ ప్రక్రియను అనుసరించవచ్చు. లేక ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా కూడా ప్రీమియం చెల్లించవచ్చు.

కొత్తగా పెట్టుబడి పెట్టే వారైతే… సెబీలో నమోదైన డిస్ట్రిబ్యూటర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ తదితర ఇంటర్మీడియటరీల ద్వారా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఒక సారి మాత్రమే చేసే ప్రక్రియ.

మ్యూచువల్‌ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం.

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు..

వీటిని అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు(ఏఎం‌సీ) అని కూడా అంటారు. పెట్టుబడి పెట్టేందుకు ఏం‌సీ సంస్థలు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్స్ సౌకర్యాలను‌ అందిస్తున్నాయి. కేవైసీ పూర్తయినట్లయితే… పెట్టుబడి దారుడు ఈ కంపెనీల కార్యాలయానికి వెళ్లి పెట్టుబడి పెట్టవచ్చు. వైబ్‌సైట్‌లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పలు మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు యాప్స్‌ను కూడా అందిస్తున్నాయి. ఫండ్‌హౌజ్​ల ద్వారా పెట్టుబడి పెట్టినట్లయితే … కేవలం ఆ సంస్థకు చెందిన మ్యూచువల్‌ ఫండ్స్​లో మాత్రమే ప్రీమియం చెల్లించవచ్చు. ఏజెంట్‌, బ్రోకరేజీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

డీమ్యాట్‌ అకౌంట్‌..

ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. డీమ్యాట్‌ అకౌంట్‌ ఉన్నట్లయితే… మ్యూచువల్‌ ఫండ్స్​ , స్టాక్స్‌, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, ఈటీఎఫ్‌ తదితర అన్ని రకాల సెక్యూరిటీల్లో ఒకే దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టవచ్చు. డీమ్యాట్‌ అకౌంట్‌ ద్వారా పెట్టుబడి పెడితే బ్రోకరేజీ ఛార్జీలు, వార్షిక ఫీజులు లాంటివి ఉంటాయి.

ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్స్‌..

ఇవి మ్యూచువల్‌ ఫండ్స్​ అగ్రిగేటర్‌ లేదా థర్డ్‌ పార్టీ ఫ్లాట్‌ఫామ్స్‌. పెట్టుబడి పెట్టటంతో పాటు మ్యూచువల్‌ ఫండ్స్​కు సంబంధించి పలు రకాల లావాదేవీలు‌ వీటి ద్వారా చేసుకోవచ్చు. గ్రో, ఫండ్స్‌ఇండియా, పేటీఎం మనీ తదితర ప్లాట్​ఫామ్స్​ వీటి కోవలోకి వస్తాయి.

స్టాక్​ ఎక్స్ఛేంజీలు..

గుర్తింపు పొందిన స్టాక్​ ఎక్స్ఛేంజి నుంచి మ్యూచువల్‌ ఫండ్స్​ను కొనుగోలు చేసేందుకు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సెబీ అనుమతినిచ్చింది. మధ్యవర్తులు లేకుండా పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి ద్వారా పెట్టుబడి పెట్టాలంటే.. నేషనల్‌ స్టాక్​ ఎక్స్ఛేంజి లేదా బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజీలలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది.

రిజిస్ట్రార్ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్స్‌ (ఆర్‌టీఏ)..

వీటి ద్వారా పెట్టుబడి పెడితే.. కేవలం ఒక కంపెనీకి చెందిన ఫండ్‌ మాత్రమే కాకుండా.. అన్ని కంపెనీల ఫంఢ్స్​ను కొనుగోలు చేసే వీలుంటుంది. సెబీలో నమోదు చేసుకున్న అన్ని ఆర్‌టీఏల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి బ్యాంకు డ్రాఫ్ట్‌ లేదా చెక్కును ఆర్‌టీఏ ఆఫీసులో అందించాలి. క్యామ్స్‌, ఆర్‌టీఏలు ప్రస్తుతం పేరొందిన ఆర్‌టీఏలుగా ఉన్నాయి.

ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సెంటర్స్‌..

ఇవి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు లేదా ఆర్‌టీఏల కార్యాలయాలు. పెట్టుబడి నుంచి వాటి ఉపసంహరణ వరకు మ్యూచువల్‌ ఫంఢ్స్​కు సంబంధించి అన్ని లావాదేవీలు ఇక్కడ చేసుకోవచ్చు.

మ్యూచువల్‌ ఫండ్‌ యుటిలిటీస్‌..

మ్యూచువల్‌ ఫండ్స్​కు సంబంధించిన లాావాదేవీల కోసం కొన్ని ఏఎం‌సీలు కలిపి ఏర్పాటు చేసే ప్లాట్‌ఫామ్స్‌ ఇవి. వీటి ద్వారా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో మ్యూచువల్‌ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇదీ చూడండి: జీవనకాల గరిష్ఠానికి విదేశీ మారకపు నిల్వలు

ABOUT THE AUTHOR

...view details