తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్​ పోల్​కే 'మస్క్'​ సై- టెస్లా వాటా విక్రయానికి సిద్ధం

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తన హోల్డింగ్స్‌లో 10 శాతం వాటాను(Elon Musk Tesla Stock) విక్రయించడానికి సిద్ధమయ్యారు. ట్విట్టర్‌ పోల్‌లో అత్యధిక శాతం మంది వాటాలు విక్రయించమనే సూచించడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో షేరు ధర సోమవారం ప్రీమార్కెట్‌లో 5 శాతం మేర తగ్గింది.

By

Published : Nov 9, 2021, 7:35 AM IST

Musk
మస్క్

విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తన హోల్డింగ్స్‌లో 10 శాతం వాటాను(2,000 కోట్ల డాలర్ల విలువైన) (Elon Musk Tesla Stock) విక్రయిస్తానని ప్రకటించిన నేపథ్యంలో షేరు ధర సోమవారం ప్రీమార్కెట్‌లో 5 శాతం మేర తగ్గింది. శనివారం ఎలాన్‌ మస్క్‌ నిర్వహించిన ట్విట్టర్‌ పోల్‌లో (Elon Musk Tesla Tweet) 58 శాతం మంది (35 లక్షల మంది పాల్గొన్నారు) వాటాలు విక్రయించమనే సూచించారు. దీంతో ఆయన 10 శాతం వాటా విక్రయానికి పూనుకున్నారు. ప్రస్తుతం ఆయనకు 17 శాతం వాటా ఉంది. షేరు ప్రస్తుత ధర 1,170 డాలర్ల వద్ద 10 శాతం వాటాలు విక్రయిస్తే ఆయనకు సుమారు 2,000 కోట్ల డాలర్లు వస్తాయి.

ఇదే కారణం..

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సహా మరికొన్ని కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎలాన్‌ మస్క్‌ నగదు రూపంలో జీతభత్యాలు(Elon Musk Salary) తీసుకోరు. కేవలం స్టాక్‌ ఆప్షన్స్‌ మాత్రమే స్వీకరిస్తారు. అంటే రాయితీ ధరతో కూడిన స్టాక్సే ఆయన వేతనం. అలా ఆయన ఖాతాలో ఉన్న 22.86 మిలియన్ల టెస్లా స్టాక్‌(Elon Musk Tesla Stock) ఆప్షన్స్‌కు వచ్చే ఏడాది ఆగస్టు 13 నాటికి కాలం చెల్లనుంది. ఆలోపు ఆయన వాటిని ముందు నిర్ణయించిన 6.24 డాలర్లకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా వీటిపై వచ్చే ఆదాయాన్ని మూలధన లాభం కింద లెక్కగడతారు. దీనిపై మస్క్‌ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన షేర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నారు.

ఈ ఏడాది టెస్లా వాటాల(Elon Musk Tesla Stock) విలువ భారీగా పెరిగింది. అక్టోబరులో స్టాక్‌ ధర జీవితకాల గరిష్ఠాలకు చేరింది. దీంతో ఎలాన్‌ మస్క్‌ సోదరుడు కింబల్‌ మస్క్‌ సహా టెస్లా బోర్డు సభ్యులు చాలా మంది తమ వాటాల్ని విక్రయించారు. మస్క్‌ మాత్రం అలా చేయకపోవడం గమనార్హం. వాటాల్లో 10 శాతం అమ్మాలనుకుంటున్న తన నిర్ణయం సరైనేదా? కాదా? అని తెలుసుకునేందుకు ట్విట్టర్​లో పోల్ నిర్వహించారు మస్క్​. అందులో అత్యధిక మంది వాటాలు విక్రయించమని సూచించడం వల్ల ఇప్పుడు షేర్లను అమ్మేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:కుబేరులు దయతలిస్తే ప్రపంచ ఆకలి తీరుతుందా!

ABOUT THE AUTHOR

...view details