తెలంగాణ

telangana

ETV Bharat / business

సంతోష్‌ ముంజల్‌ కన్నుమూత - హీరో మోటోకార్ప్​ అధినేత భార్య కన్నుమూత

ప్రముఖ ఆటోమొబైల్​ దిగ్గజం హీరో మోటోకార్ప్​ అధినేత బ్రిజ్​మోహన్​లాల్​ సతీమణి సంతోష్​​ ముంజల్​ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Munjal family matriarch Santosh Munjal passes away at 92
సంతోష్‌ ముంజల్‌ కన్నుమూత

By

Published : Apr 3, 2021, 1:27 PM IST

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ వ్యవస్థాపకుడు దివంగత బ్రిజ్‌మోహన్‌ లాల్‌ ముంజల్‌ సతీమణి సంతోష్​​ ముంజల్‌(92) కన్నుమూశారు. శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ముంజల్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1947లో బ్రిజ్‌మోహన్‌ లాల్‌తో ఆమె వివాహం జరిగింది. 1953లో హీరో సంస్థ స్థాపించిన నాటి నుంచి ఆమె బ్రిజ్‌మోహన్‌కు వెన్నంటి నిలిచారు.

ప్రస్తుతం ఆమె కుమారులు సుమన్‌ ముంజల్‌ రాక్‌మ్యాన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా, పవన్‌ ముంజల్‌ హీరో మోటోకార్ప్‌ ఎండీ, సీఈఓగా, సునీల్‌ ముంజల్‌ హీరో ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు గీతా ఆనంద్‌ అనే కూతురు కూడా ఉన్నారు.

ఇదీ చూడండి:దూకుడు పెంచిన హీరో.. రెండు నెలల్లో 10 కొత్త మోడళ్లు!

ABOUT THE AUTHOR

...view details