తెలంగాణ

telangana

ETV Bharat / business

Munich Auto Show: వాహన యంత్ర.. విద్యుత్‌ మంత్ర - జర్మనీ ఆటో షోలో బెస్ట్ విద్యుత్​ కార్లు

జర్మనీలోని మ్యునిచ్‌లో అంతర్జాతీయ వాహన ప్రదర్శన 2021 ఘనంగా జరిగింది. విద్యుత్ వాహనాలు, ప్రత్యామ్నాయ రవాణా వంటి కాన్సెప్ట్​లకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిన ఈ ఆటో షోలో దిగ్గజ కంపెనీలు అదిరిపోయే కాన్సెప్ట్​లను ప్రదర్శించాయి. ఈ సారి ప్రదర్శనకు వచ్చిన టాప్​ 10 మోడళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

New Concepts in Germany Auto Show
జర్మనీ ఆటో షో కొత్త కాన్సెప్ట్​లు

By

Published : Sep 19, 2021, 7:52 AM IST

ఓ వైపు కొవిడ్‌-19 పరిణామాలు చేసిన గాయాలు.. మరోవైపు పర్యావరణ హితమైన విద్యుత్తు వాహనాల వైపు అడుగులు వేయాలనే ప్రణాళికలు.. ఈ నేపథ్యంలో జర్మనీలోని మ్యునిచ్‌లో అంతర్జాతీయ వాహన ప్రదర్శన 2021 జరిగింది. ఈసారి ప్రదర్శనలో విద్యుత్ వాహనాలు, ప్రత్యామ్నాయ రవాణా, కాన్సెప్ట్‌లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో అత్యుత్తమైనవని చెబుతున్న 10 కొత్త వాహనాల వివరాలు ఇలా..

విడిభాగాలు 100% పునర్వినియోగం: బీఎండబ్ల్యూ

బీఎండబ్ల్యూకు చెందిన ప్రస్తుత ఐ3 విద్యుత్తు కారు (ఈవీ) పరిమాణంలోనే ఈ సబ్‌కాంప్యాక్ట్‌ హాచ్‌బ్యాక్‌ను తీర్చిదిద్దనున్నారు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. లోపల విశాలంగానే ఉంటుంది. విద్యుత్తు మోటార్‌, బ్యాటరీ ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించకపోవడమే ఇందుకు కారణం. ఇందులోని విడిభాగాలు 100 శాతం పునర్వినియోగానికి అనువైనవే. అందుకే సర్క్యులర్‌ అనే పదాన్ని ఈ కాన్సెప్ట్‌కు చేర్చారు.

బీఎండబ్ల్యూ సరికొత్త కాన్సెప్ట్​

అందుబాటు ధరలో మెర్సిడెస్‌

ప్రస్తుతమున్న జీఎల్‌బీ- క్లాస్‌ క్రాసోవర్‌కు మెర్సిడెస్‌ బెంచ్‌ ఈక్యూబీ విద్యుత్తు వెర్షన్‌. మెర్సిడెస్‌ విద్యుత్తు వాహనాల్లో అత్యంత అందుబాటులో ధరలో లభించనున్న వాహనాల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. 184 అంగుళాల పొడువుతో 66.6 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ, 168 కేడబ్ల్యూ లేదా 215 కేడబ్ల్యూ విద్యుత్తు మోటార్లతో దీనిని అందుబాటులోకి తేనున్నారు.

రేసర్ల కోసం పోషే మిషన్‌ ఆర్‌

ప్రత్యేకంగా రేసర్ల కోసం విద్యుత్తు మిషన్‌ ఆర్‌ కాన్సెప్ట్‌ను పోషే అభివృద్ధి చేయనుంది. రేసింగ్‌ మోడ్‌లో 671 హార్స్‌పవర్‌, క్వాలిఫయింగ్‌ మోడ్‌లో 1073 హార్స్‌పవర్‌ ఉండే ఈ కారులో ముందు, వెనక వేర్వేరుగా ఎలక్ట్రిక్‌ మోటార్లు ఇందులో ఉంటాయి. ఇవి 2.5 సెకన్లలోనే 100 కేపీహెచ్‌ వేగాన్ని అందుకునేలా చేస్తాయి. 90 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఇందుకు తోడ్పడుతుంది. బ్యాటరీని 5 శాతం నుంచి 80 శాతానికి కేవలం 15 నిమిషాల్లోనే ఛార్జ్‌ చేయొచ్చు. 2026 కల్లా ఈ మోడల్‌ సిద్ధం కావొచ్చని కంపెనీ భావిస్తోంది.

పోషే మిషన్‌ ఆర్‌

ఒక ఛార్జింగ్‌తో 249 మైళ్ల ప్రయాణం.. ఫోక్స్‌వ్యాగన్‌

ఫోక్స్‌వ్యాగన్‌ ఐడీ లైఫ్‌ను 231 హార్స్‌పవర్‌ విద్యుత్తు మోటార్‌, 57 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో అందుబాటులోకి తేనున్నారు. పరిమాణంలో ఐడీ సిరీస్‌ కార్ల కంటే తక్కువగానే ఇది ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్‌తో 249 మైళ్లు ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. 2025లో ఈ కారు ఎగుమతులు ప్రారంభం కావొచ్చు.

స్మార్ట్‌ కాన్సెప్ట్‌ 1

స్మార్ట్‌ సిటీ కార్లు.. ఒకప్పుడు చిన్నగా, సన్నగా ఉండేవి. అయితే వీటి ఖరీదు మాత్రం ఎక్కువే. ఐరోపాలో 2003 నుంచి పెద్ద కార్లను కూడా స్మార్ట్‌ అందుబాటులోకి తెచ్చింది. 2017 నుంచి విద్యుత్తు వెర్షన్స్‌ను ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది. ఇప్పుడు కాన్సెప్ట్‌ 1ను స్మార్ట్‌ ప్రదర్శించింది. దైమ్లర్‌, చైనాకు చెందిన గీలే సంస్థలు చైనాలో అభివృద్ధి చేయనున్నాయి. 169 అంగుళాల పొడువుతో దీనిని తీర్చిదిద్దనున్నారు.

కాన్సెప్ట్‌ 1

గతుకుల రోడ్లకూ మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూజీ

మెర్సిడెజ్‌ బెంజ్‌ జి-క్లాస్‌ మోడల్‌లో ఎలక్ట్రిక్‌ వాహనం రకాన్ని ప్రదర్శించారు. గతుకుల రహదార్లపైనా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దారు. నాలుగు ఎలక్ట్రిక్‌ మోటార్లు.. ఒక్కో చక్రాన్ని ముందుకు నడిపిస్తాయి. పెద్ద డోర్‌ హాండిల్స్‌, సైడ్‌ ట్రిమ్స్‌, వెనకాల బలమైన యాక్సిల్‌ లాంటి ప్రత్యేకతలున్న దీని ధర 1,30,000 డాలర్ల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అడ్వెంచర్లకు మిని విజన్‌ అర్బనాట్‌

బీఎండబ్ల్యూకి చెందిన మినీ తన 2020 కాన్సెప్ట్‌ విద్యుత్‌ వాహనం అర్బనాట్‌ను ఈ ప్రదర్శనలో మళ్లీ ప్రదర్శించింది. చిన్నవ్యాన్‌ తరహాలో ఉండే ఇందులో సోఫా స్టయిల్‌ సీటింగ్‌ ఉంటుంది. అడ్వెంచర్లను కోరుకునే వారికి ఈ వాహనం నప్పుతుంది.

కుటుంబ ప్రయాణానికి.. డేసియా జాగర్‌

రొమేనియాకు చెందిన కార్ల తయారీ సంస్థ డేసియా తన అతిపెద్ద ఎస్‌యూవీ ‘జాగర్‌’ను పరిచయం చేసింది. కుటుంబమంతా ప్రయాణించేందుకు అనువుగా మూడు వరుసల సీటింగ్‌ ఎంపికతో దీనిని తీర్చిదిద్దనుంది. 18000 డాలర్ల ప్రారంభ ధరతో ఈ ఎస్‌యూవీని తీసుకొని రావాలని కంపెనీ అనుకుంటోంది.

వెడల్పు మార్చుకునే వీలున్న సిటీ ట్రాన్స్‌ఫార్మర్‌

మనకు ఎలా వీలైతే అలా వెడల్పును మార్చుకునే వెసులుబాటు ఉండటం సిటీ ట్రాన్‌ఫార్మర్‌ కారు ప్రత్యేకత. కాంపాక్ట్‌ మోడ్‌లో.. పార్కింగ్‌ స్పేస్‌కు సరిపోయేలా ఉంటుంది. సిటీ మోడ్‌లో 39 అంగుళాలు, పెర్‌ఫార్మెన్స్‌ మోడల్‌లో 55 అంగుళాల పొడువు ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రి-ఆర్డర్‌ దశలోనే ఉంది. 90 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణంచే ఈ కారు ధర 15000 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది.

రోడ్డుపై ప్రైవేటు జెట్‌.. ఆడి గ్రాండ్‌ స్పియర్‌ కాన్సెప్ట్‌

రహదారిపై ప్రైవేట్‌ జెట్‌గా గ్రాండ్‌స్పియర్‌ను ఆడి అభివర్ణించింది. స్పోర్టీ ఆడి స్కైస్పియర్‌ కంటే ఇది పెద్దగా, పొడువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. కొన్ని రహదారులపై సెల్ఫ్‌డ్రైవింగ్‌కు, మిగతా రహదారులపై సాధారణ డ్రైవింగ్‌కు ఇందులో వీలుంటుంది. డ్యాష్‌బోర్డులోకి స్టీరింగ్‌ వెళ్లే వీలుంది. 2025 లేదా 2026 కల్లా ఈ కారు అందుబాటులోకి రావొచ్చు.

సిటీ ట్రాన్స్​ఫార్మర్​

ఇదీ చదవండి:'ఓలా ఎలక్ట్రిక్​' రికార్డ్- 2 రోజుల్లో రూ.1,100 కోట్ల విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details