రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సంపన్నుల జాబితాలో మరో రికార్డు సృష్టించారు. టెక్ దిగ్గజాలు ఎలన్ మస్క్, ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రైన్, లారీ పేజ్‌ను వెనక్కి నెట్టి మరింత ముందుకు దూసుకుపోయారు. దీంతో ప్రపంచంలో ఆరో సంపన్న వ్యక్తిగా ముఖేశ్ అవతరించారు.
గత వారమే ఆయన ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం అంబానీ సంపద 72.4 బిలియన్ డాలర్లకు చేరింది. మార్చి నుంచి ఇప్పటి వరకు సంస్థ షేర్ల విలువ రెట్టింపునకు పైగా పెరిగింది. గత శుక్రవారం రిలయన్స్ మార్కెట్ విలువ కూడా రూ.12 లక్షల కోట్లను దాటేసింది.