తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో అపరకుబేరుడు మళ్లీ అంబానీయే - forbes list

రిలయన్స్​ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ భారత్​లో అత్యంత సంపన్నునిగా మరోసారి నిలిచారు. ప్రఖ్యాత ఫోర్బ్స్​ విడుదల చేసిన ప్రపంచ సంపన్నుల జాబితాలో 17వ స్థానం దక్కించున్నారు. మొదటి స్థానంలో అమెజాన్​ వ్యవస్థాపకుడు జెఫ్​ బెజోస్ నిలవగా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​ రెండో స్థానంలో ఉన్నారు.

Mukesh Ambani with $44bn top Indian in Forbes world billionaires' list
భారత్​లో అపరకుబేరుడిగా మళ్లీ అంబానీయే

By

Published : Apr 9, 2020, 3:08 PM IST

Updated : Apr 11, 2020, 10:07 AM IST

ప్రఖ్యాత ఫోర్బ్స్​ మేగజిన్​ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాను విడుదల చేసింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్​ బెజోస్​ మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. మైక్రోసాప్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు. భారత్​లో అంత్యంత సంపన్నుడిగా మరోసారి ముఖేశ్ అంబానీయే నిలిచారు. 44.3 బిలియన్​ డాలర్లు విలువ చేసే ఆస్తులతో ప్రపంచ సంపన్నుల జాబితాలో 17వ స్థానం దక్కించుకున్నారు రిలయన్స్​ సంస్థల అధినేత.

భారత కుబేరులలో అంబానీ తర్వాతి స్థానంలో ముంబయికి చెందిన ప్రముఖ ఇన్వెస్టర్​ రాధాక్రిష్ణన్​ దమానీ ఉన్నారు. ఆయను ఆస్తుల విలువ 16.6 బిలియన్​ డాలర్లు. 2017లో డీమార్ట్​ గొలుసు ఐపీఓ తర్వాత ఆయన రిటైల్ రారాజుగా కీర్తి గడించారు.

భారత్​లో అపరకుబేరుడు మళ్లీ అంబానీయే

రిలయన్స్ హవా..

భారత్​లో ఉచిత వాయిస్​ కాల్స్, డాటా ఛార్జీలు అత్యంత చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చి టెలికాం రంగంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది రిలయన్స్ జియో. అత్యంత వేగంగా 34 కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది. రిలయన్స్ సంస్థల చమురు, వాయు నిక్షేపాలతో కలిపి మొత్తం 88 బిలియన్ డాలర్ల రెవెన్యూతో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు అంబానీ
.

Last Updated : Apr 11, 2020, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details