తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఇలాంటి కీలక సమయంలో అలసత్వం వద్దు' - కరోనా పై ముకేశ్​ అంబానీ

కరోనాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ. కొవిడ్‌-19 పై పోరులో భారత్‌ కీలక దశకు చేరుకుందని, ఈ సమయంలో అలసత్వం ప్రదర్శించొద్దని అన్నారు. గుజరాత్‌ గాంధీనగర్‌లోని పెట్రోలియం వర్సిటీ స్నాతకోత్సవంలో వర్చువల్​గా పాల్గొన్నారు ముకేశ్.

MUKESH AMBANI ON COVID-19 IN PETROLIUM UNIVERSITY
'ఇలాంటి కీలక సమయంలో అలసత్వం వద్దు'

By

Published : Nov 21, 2020, 3:10 PM IST

కొవిడ్‌ మహమ్మారిపై పోరులో భారత్‌ కీలక దశకు చేరుకుందని, ఇలాంటి సమయంలో అలసత్వం ప్రదర్శించొద్దని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ అన్నారు. గుజరాత్‌ గాంధీనగర్‌లో పెట్రోలియం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. యునివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్న ముకేశ్‌ అంబానీ కరోనాపై పోరులో అజాగ్రత్తగా ఉండటం అలసత్వం ప్రదర్శించడం మంచిది కాదని సూచించారు.

ఎన్నో అధిగమించాం

భారత్‌ గతంలో కూడా ఎన్నో కష్టాలు, విపత్తులను ఎదుర్కొందన్న అంబానీ ప్రతిసారి వాటి నుంచి బయటపడి మరింత దృఢంగా ఉద్భవిందని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, పట్టుదల మన సంస్కృతిలో బలంగా ఇమిడిపోయాయని తెలిపారు. కొవిడ్‌ తర్వాత దేశంలో వేగవంతమైన వృద్ధిని చూస్తామని తెలిపారు.

రానున్న రెండు దశాబ్దాల్లో ఈ వృద్ధి విస్తృత అవకాశాలు సృష్టిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ గల దేశాల జాబితాలో భారత్‌ తొలి మూడు స్థానాల్లో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో ఆవిష్కరణలు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details