తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానానికి అంబానీ - Mukesh Ambani

ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ రియల్​టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రపంచంలోనే ఐదో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ప్రస్తుతం ఆయన సంపద రూ.5.61 లక్షల కోట్లుగా ఉంది.

Mukesh Ambani now world's fifth richest as RIL shares soar to new highs
ప్రపంచంలోనే ఐదో అత్యంత ధనవంతుడిగా ముఖేశ్ అంబానీ

By

Published : Jul 22, 2020, 7:48 PM IST

Updated : Jul 22, 2020, 9:41 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్​ ముఖేశ్ అంబానీ... ప్రపంచంలోనే ఐదో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ రియల్ టైమ్ బిలయనీర్స్ జాబితా ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం 75 బిలియన్ డాలర్లు (5.61 లక్షల కోట్లుగా ఉంది.)

రిలయన్స్ దూకుడు

బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ రూ.2,010 (35 శాతం) గరిష్ఠ స్థాయిని చేరింది. దీనితో సంస్థ ఆదాయం 4.49 శాతం పెరిగింది. దానితో ఆర్​ఐఎల్​ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.70 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్ లాభాల పంటతో ముఖేశ్ అంబానీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది.

రుణరహిత సంస్థగా ఆర్​ఐఎల్​

రిలయన్స్ ఇండస్ట్రీని రుణరహితం సంస్థగా మార్చడమే లక్ష్యంగా ముఖేశ్ అంబానీ పావులు కదిపారు. అందులో భాగంగా గత కొన్ని నెలలుగా జియో ప్లాట్​ఫాంలోని వాటాలను ఫేస్​బుక్​, గూగుల్, క్వాల్కం వెంచర్స్ లాంటి బడా అంతర్జాతీయ సంస్థలకు విక్రయించారు. ఫలితంగా ఇప్పటికే ఆర్​ఐఎల్ రుణరహిత సంస్థగా నిలిచింది.

అపర కుబేరులు

ప్రపంచంలోనే టాప్​ 10 అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించిన ఏకైక ఆసియా వ్యక్తి ముఖేశ్ అంబానీ. కొన్ని రోజుల క్రితం ఆయన సంపద విషయంలో... బెర్క్​షైర్​ హాత్​వే అధినేత వారెన్ బఫెట్​ను అధిగమించారు. అయితే బఫెట్​ 2.9 బిలియన్ డాలర్ల సంపదను స్వచ్ఛంద సంస్థలకు దానం చేయడం వల్లనే ఇది సాధ్యమైంది.

ఇప్పుడు ముఖేశ్ అంబానీ కంటే ముందు ఫేస్​బుక్ అధినేత మార్క్ జుకర్​బర్గ్ ఉన్నారు. ప్రస్తుతం జుకర్​బర్గ్ ఆయన నికర ఆస్తుల విలువ 89 బిలియన్ డాలర్లుగా ఉంది.

  • ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ 185.8 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఆల్​టైం రికార్డు సృష్టించిన బంగారం ధరలు

Last Updated : Jul 22, 2020, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details