రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు. సోమవారం ఆయన సంపద (Mukesh Ambani is now worth) తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. కంపెనీ షేర్లు భారీగా పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణం.
రిలయన్స్ షేర్లు (Reliance Share price) సోమవారం ఒకానొక దశలో 3 శాతం ఎగబాకాయి. దీనితో కంపెనీ మార్కెట్ క్యాపిటల్ (Reliance M-cap) రూ.16.3 (223 బిలియన్ డాలర్లు) లక్షల కోట్లు దాటింది. ఫలితంగా కంపెనీలో మెజారిటీ వాటా ఉన్న ముకేశ్ సంపద 100 బిలియన్ డాలర్లపైకి చేరింది. ఆసియాలో ఈ స్థాయికి సంపద చేరిన.. తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.
షేర్లు దూకుడుకు కారణాలు..
రిలయన్స్ చమురు వ్యాపారాల్లో 20 శాతం వాటా సౌదీ ఆరామ్కోకు విక్రయించే ప్రక్రియ దాదాపు ముగింపు దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
జియో ఆదాయం.. సగటున ఒక యూజర్ నుంచి సగటున రూ.160-170గా నమోదైనట్లు ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.
గ్రీన్ ఎనర్జీపై భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్ ఇప్పటికే స్పష్టం చేసింది.
టెలికాం సంస్థ టీ-మొబైల్ నెదర్లాండ్స్‌ను 5.7 బిలియన్ డాలర్లతో స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తుండటం సహా అనేక ఇతర సానుకూలతలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి.
100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోని ఇతర వ్యక్తులు వీరే..
- జెఫ్ బెజోస్ (అమెజాన్ అధినేత)- 200.7 బిలియన్ డాలర్లు
- ఎలాన్ మస్క్ (టెస్లా సీఈఓ) - 198.9 బిలియన్ డాలర్లు
- బెర్నార్డ్ ఆర్నల్డ్ (ఎల్వీఎంహెచ్ ఛైర్మన్) - 163.6 బిలియన్ డాలర్లు
- బిల్‌గేట్స్ (మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు) - 153.6 బిలియన్ డాలర్లు
- ల్యారీ పేజ్ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు)- 128.1 బిలియన్ డాలర్లు
- సెర్గి బ్రిన్ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు)- 123.6 బిలియన్ డాలర్లు
- స్టీవ్ బామర్ (ప్రముఖ వ్యాపారవేత్త) - 107.6 బిలియన్ డాలర్లు
- ల్యారీ ఎలీసన్ (ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు) - 103.8 బిలియన్ డాలర్లు
- వారెన్ బఫెట్ (ప్రముఖ ఇన్వెస్టర్) - 102.6 బిలియన్ డాలర్లు
- నోట్: ఆయా వ్యక్తుల సంపద వివరాలు బ్లూమ్‌బర్గ్ తాజా రిపోర్ట్ ద్వారా తెలిసినవి.
ఇదీ చదవండి:బ్యాంకులకు వరుస సెలవులు- వారంలో ఐదు రోజులు బంద్!