ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ.. 2020-21లో ఒక్క రూపాయి జీతం అయినా తీసుకోలేదు. కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను, వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో.. తన వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు.
ఇటీవలే రిలయన్స్ ప్రకటించిన తన వార్షిక నివేదికలో ముకేశ్ అంబానీ జీతాన్ని 'జీరో'గా చూపించింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ.. ముకేశ్ అంబానీ రూ.15 కోట్లను వేతనంగా పొందారు. 11 ఏళ్లుగా ఇదే మొత్తాన్ని వేతనంగా అందుకుంటున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి వేతనం, ఇతర అలవెన్సుల మొత్తాన్ని రూ.15 కోట్ల వద్ద స్థిరంగా ఉంచారు. నిజానికి ఈ మొత్తం ఏడాదికి రూ.24 కోట్లుగా ఉండాలి.