తెలంగాణ

telangana

ETV Bharat / business

అంబానీ గ్యారేజ్​లోకి అల్ట్రా లగ్జరీ కారు​.. ధర ఎంతో తెలుసా? - rolls royce cullinan

Mukesh Ambani Cars: భారత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచే బిజినెస్​ టైకూన్​ ముకేశ్​ అంబానీ. విలాసవంతమైన జీవితం గడిపే ఆయన తాజాగా.. మరో ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ఇది.. భారత్​లో కొనుగోలు చేసిన కాస్ట్​లీ కారుగా గుర్తింపు పొందింది. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా?

mukesh ambani
ముకేశ్​ అంబానీ

By

Published : Feb 4, 2022, 10:43 PM IST

Mukesh Ambani Cars: దిగ్గజ వ్యాపావేత్త, అపర కుబేరుడైన ముకేశ్​ అంబానీ మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అత్యంత విలాసవంతమైన కార్లను అందించే రోల్స్ ​రాయ్స్​ సంస్థకు చెందిన కల్లీనన్​ కారును కొనుగోలు చేశారు. ధీని ధర రూ. 13.14 కోట్లు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ పేరు మీద ఈ కారు గతనెల 31న రిజిస్టర్​ అయినట్లు దక్షిణ ముంబయి ఆర్​టీఓ అధికారులు వెల్లడించారు.

కారులో మార్పులకు అన్ని రూ.కోట్లా?

2018లో వచ్చిన ఈ మోడల్​ కొనుగోలు ధర రూ.6.95 కోట్లు. కానీ ఆ కారులో తమకు అనుగుణంగా మార్పులు చేయించుకోవడం వల్ల ఇంత మొత్తం అయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'టస్​కాన్​ సన్​' అనే ప్రత్యేకమైన రంగును ఈ కారుకు సంస్థ ఎంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 2.5 టన్నుల బరువు ఉండే ఈ కారు 564 హార్స్​పవర్​తో దూసుకెళ్తుందని తెలిపారు.

రోల్స్​రాయ్స్​ కల్లీనన్
రోల్స్​రాయ్స్​ కల్లీనన్

కారు రిజిస్ట్రేషన్​ నెంబరు 0001తో ముగుస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఫ్యాన్సీ నంబరు కోసం రూ.12 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి :జుకర్​బర్గ్​ను వెనక్కి నెట్టిన అంబానీ, అదానీ

ABOUT THE AUTHOR

...view details