ఆసియాలో అత్యధిక సంపద కలిగిన కుబేరులుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ నిలిచారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ముకేశ్ సంపద 8400 కోట్ల డాలర్లకు, అదానీ సంపద విలువ 7800 కోట్ల డాలర్లకు చేరిందని తెలిపింది.
ప్రపంచ కుబేరుల్లో చైనాకు చెందిన జాక్‌మా వంటి వారి కంటే పైస్థాయికి అంబానీ, అదానీ చేరారని వివరించింది. ప్రపంచ కుబేరుల్లో అంబానీ 12వ స్థానంలో, అదానీ 14వ స్థానంలో ఉన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఎల్‌వీఎంహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ అర్‌నాల్ట్ (2), ప్రపంచ మహిళా కుబేరుల్లో అగ్రస్థానం పొందిన లోరెల్‌కు చెందిన మెయర్స్ (10) మినహా అంబానీ కంటే బ్లూమ్‌బర్గ్ జాబితాలో ఉన్నవారంతా అమెరికన్లే. 100 మంది జాబితాలో విప్రో అజీమ్ ప్రేమ్‌జీ 43, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ 70, లక్ష్మీ మిత్తల్ 88వ స్థానంలో ఉన్నారు.