చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ ప్రకటించనున్నట్లు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ నిర్వహించిన రెండో విడత బిజ్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు.
చిన్న తరహా పరిశ్రమలకు ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ
హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ అసోసియేషన్ నిర్వహించిన రెండో విడత బిజ్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ హాజరయ్యారు.
ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ
కరోనా సమయంలో వేరే నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారటం సులభంగా జరిగినట్లు ఐటీ కంపెనీల ప్రతినిధులు చెప్పారని పేర్కొన్నారు. కొవిడ్ వల్ల డిజిటలైజేషన్ లేని రంగమనేది లేకుండా ఉందని... ఐటీ పరిశ్రమలకు అపార అవకాలున్నాయన్నారు. అమెరికాలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో అవకాశాలున్నాయని... ఆ దేశాల వల్ల చిన్న తరహా ఐటీ కంపెనీలు లబ్ధి పొందవచ్చన్నారు.
ఇదీ చదవండి:కరోనా బారినపడి హెడ్ కానిస్టేబుల్ మృతి