తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్యోగులకు మారుతీ సుజుకీ పండుగ ఆఫర్​! - మారుతీ సుజుకీ కొత్త ఆఫర్లు

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్​లో కారు​ కొనుగోలు చేసే వారికి రూ.11 వేల వరకు ప్రయోజనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వ చర్యలు చేపట్టిన నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా ఈ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది.

Maruti Suzuki Festive offer to govt Employees
ఉద్యోగులకు మారుతీ పండుగ ఆఫర్

By

Published : Oct 18, 2020, 5:08 PM IST

Updated : Oct 18, 2020, 5:25 PM IST

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంగా ఉద్యోగులకు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కొత్త ఆఫర్‌ ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో మారుతీ కార్ల కొనుగోలుపై వారికి రూ.11 వేలకు వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులు.. పోలీసు, పారామిలటరీ సిబ్బంది కొత్త కారు కొనేటప్పుడు ఈ ప్రయోజనాలను అందిస్తామని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టిందని, తమవంతు బాధ్యతగా వీటిని అందిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెట్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఉద్యోగులకు ఎల్​టీసీ క్యాష్​ ఓచర్లు, ఫెస్టివల్ అడ్వాన్స్​!

ఎల్​టీసీ ఓచర్​కు అదనంగా..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సుమారు కోటి మంది పనిచేస్తున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు శశాంక్‌ తెలిపారు. దీని ద్వారా తమకు ఇష్టమైన కార్లను ఇంటికి తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌టీసీ ఎన్‌క్యాష్‌మెంట్‌ బెన్‌ఫిట్‌కు అదనంగా ఈ సదుపాయం పొందొచ్చని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎల్‌టీసీ క్యాష్‌ ఓచర్‌ స్కీమ్‌తో సుమారు 45 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని కంపెనీ పేర్కొంది.. ఈ స్కీమ్‌ వల్ల 2021 మార్చి 31 నాటికి అదనంగా రూ.28వేల కోట్ల మేర డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇదీ చూడండి:పండుగలకు ముందు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

ఆఫర్​ వర్తించే మోడళ్లు..

ఆల్టో, సెలేరియో, ఎస్‌-ప్రెస్సో, వ్యాగన్‌-ఆర్‌, ఈకో, స్విఫ్ట్‌, డిజైర్‌, ఇగ్నిస్‌, బాలెనో, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6, సియాజ్‌, ఎస్‌-క్రాస్‌ వంటి మోడళ్ల కొనుగోలుపై ఈ స్కీమ్‌ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇదీ చూడండి:పండుగ సీజన్​లో కార్లపై అదిరే ఆఫర్లు ఇవే..

Last Updated : Oct 18, 2020, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details