తెలంగాణ

telangana

ETV Bharat / business

గ్రీన్ రోబోటిక్స్, బీఈఎల్ మధ్య ఒప్పందం - గ్రీన్ రోబోటిక్స్ వార్తలు

ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ విభాగంలో కలిసి పనిచేసేందుకు హైదరాబాద్​కు చెందిన గ్రీన్ రోబోటిక్స్, బీఈఎల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అటానమస్ మ్యాన్ పాడ్ డేటా సిస్టంను అభివృద్ధి పరిచి దేశ రక్షణ రంగానికి అందించనున్నాయి. సైనికులు నిర్దేశించికున్న లక్ష్యాలను రియల్ టైం కాలంలో ఛేదించేలా వీటిని తయారుచేయనున్నారు.

bel
bel

By

Published : Feb 6, 2021, 8:46 AM IST

హైదరాబాద్​కు చెందిన గ్రీన్ రోబోటిక్స్.. నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​తో ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ విభాగంలో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బెంగళూరులో జరుగుతోన్న ఎయిరో ఇండియా ప్రదర్శనలో భాగంగా ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా రెండు కంపెనీలు అటానమస్ మ్యాన్ పాడ్ డేటా సిస్టంను అభివృద్ధి పరిచి దేశ రక్షణ రంగానికి అందించనున్నాయి.

ఆగ్ మెంటెడ్, వర్చువల్ రియాలిటీ, సెన్సర్ ఆధారంగా పనిచేసే ఈ మ్యాన్ పాడ్ డిఫెన్స్ పరికరాలకు ఇప్పుడు విస్తృత డిమాండ్ ఉంది. సైనికులు నిర్దేశించికున్న లక్ష్యాలను రియల్ టైం కాలంలో ఛేదించేలా వీటిని తయారుచేయనున్నారు. దేశ రక్షణ సామర్థ్యాలను పెంచేలా, ప్రపంచ దేశ రక్షణ వ్యవస్థలతో భారత్ పోటీ పడేలా అవసరమైన వ్యవస్థలను, పరికరాలను సమకూర్చుకునే ఆత్మనిర్భర భారత్​లో భాగంగా ఈ ఒప్పందం జరిగినట్లు కంపెనీలు ప్రకటించాయి.

ఇదీ చదవండి :విమాన రంగానికి తెలంగాణ రెక్కలు

ABOUT THE AUTHOR

...view details