ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా.. ఎడ్జ్, ఎడ్జ్ ప్లస్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో మోటోరోలా ఎడ్జ్ ప్లస్‌ను ప్రీమియం సెగ్మెంట్‌లో, మోటోరోలా ఎడ్జ్‌ను మిడ్ రేంజ్‌గా తీసుకువచ్చింది. ఈ మోడళ్లు 5 జీతో పని చేస్తాయని వెల్లడించింది.
మోటోరోలా ఎడ్జ్ ఫోన్ ఫీచర్లు ఇవే..
- 6 జీపీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
- 6.70 ఇంచుల డిస్‌ప్లే
- వెనుక వైపు మూడు కెమెరాలు (64 ఎంపీ+16 ఎంపీ+8 ఎంపీ)
- 25ఎంపీల పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా
- 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ
- 18 వాట్స్ పాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- ఆండ్రాయిడ్ 10 ఓఎస్
మోటోరోలా ఎడ్జ్ ప్లస్ ఫోన్ ఫీచర్లు ఇలా..
- 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ స్టోరేజ్
- 6.70 ఇంచుల ఎండ్ లెస్ ఎడ్జ్ 90హెచ్జడ్ డిస్‌ప్లే
- స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
- వెనుక వైపు మూడు కెమెరాలు (108 ఎంపీ+16 ఎంపీ+8 ఎంపీ)
- 25 మెగా పిక్సెళ్ల పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్స్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ఆండ్రాయిడ్ 10 ఓఎస్
అమెరికా మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ ధర 750 డాలర్లు, మోటోరోలా ఎడ్జ్ ప్లస్ ధర 999 డాలర్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు మోడళ్లు భారత్ మార్కెట్లలోకి ఎప్పుడు రానున్నాయనే విషయంపై మోటోరోల్ స్పష్టతనివ్వలేదు.
ఇదీ చదవండి:ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ