మోటోరోలా కంపెనీ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. మోటో జీ9 పవర్ పేరుతో డిసెంబర్ 8న ఈ మొబైల్‌ను విడుదల చేయనుంది. ఈ మేరకు కంపెనీ ట్వీట్ చేసింది. 'ఓ కొత్త తరహా పవర్ ఫోన్ మీ చేతుల్లోకి రానుంది. దాని పేరు మోటో జీ9 పవర్. డిసెంబర్ 8, మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ వేదికగా మొబైల్ లాంచ్ అవుతోంది. అప్పటి వరకు వేచి చూడండి' అని మోటోరోలా కంపెనీ ట్వీట్ చేసింది.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొబైల్ ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ను ఇప్పటికే యూరప్‌లో లాంచ్ చేశారు. ఫోన్ ధర రూ. 17,400 (199 యూరోలు) అని తెలుస్తోంది. మిగతా కంపెనీలకు పోటీగా కొత్త తరహా ఫీచర్స్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. యువతే లక్ష్యంగా టర్బో పవర్‌తో ఆకర్షణీయంగా మొబైల్‌ను రూపొందించినట్లు సమాచారం.