లీటరు పాలపై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ మదర్ డెయిరీ. ఆదివారం నుంచి దిల్లీ సహా వివిధ పట్టణాల్లో ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సంస్థ వెల్లడించింది. పాడి రైతుల వద్ద కొనుగోలు ధర సహా ఇతర ఖర్చులు పెరిగిన కారణంగానే ధరలను పెంచుతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఏడాదిలో కొనుగోలు ధర 8-10 శాతానికి పెరిగినట్లు తెలిపింది. తమకున్న ఖర్చుల భారాన్ని కొంత తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మదర్ డెయిరీ ఉద్ఘాటించింది.
పెరిగిన పాల ధరలు.. లీటరుపై రూ.2 వడ్డన - పాల ధరల పెంపు
పెరిగిన పాల ధరలు.. లీటరుపై రూ.2 వడ్డన
10:27 July 10
పెరిగిన పాల ధరలు.. లీటరుపై రూ.2 వడ్డన
ఈ ధరల పెంపుతో లీటరు రూ.42గా ఉన్న బల్క్ వెండెడ్ పాల ధర రూ.44కు చేరనుంది. పాలీ ప్యాక్ లీటరు రూ.55 నుంచి రూ.57కి.. టోన్డ్ మిల్క్ ధర రూ.45 నుంచి రూ.47కు పెరిగింది.
2019 డిసెంబరు తర్వాత మదర్ డెయిరీ పాల ధరలను పెంచడం ఇదే తొలిసారి.
ఇటీవల మరో ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్ కూడా పాల ధరలను పెంచింది.
ఇదీ చదవండి :మళ్లీ పెరిగిన చములు ధరలు- పెట్రోల్ లీటర్ ఎంతంటే?
Last Updated : Jul 10, 2021, 11:19 AM IST