Most Popular Websites 2021: ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫార్మ్ టిక్‌టాక్, టెక్ దిగ్గజమైన గూగుల్‌ను అధిగమించి ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌గా నిలిచిందని ఐటీ భద్రతా సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ వెలువరించిన నివేదికలో తెలిపింది. వైరల్ వీడియో యాప్ టిక్‌టాక్ యూఎస్ ఆధారిత సెర్చ్ ఇంజిన్ గూగుల్ కంటే అధికంగా హిట్‌లను అందుకుందని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, జూన్లలో గూగుల్ అగ్రస్థానంలో ఉండగా ఆగస్ట్ నుంచి టిక్‌టాక్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ర్యాంకింగ్‌లు సూచిస్తున్నట్లు వెల్లడించారు.
Most Visited Websites in 2021: