దేశంలో ఆన్లైన్ కంటెంట్ వినియోగం ఇటీవలి కాలంలో భారీగా పెరిగింది. దీనిపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సాధారణ ఆఫీసు పని వేళలైన.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్లైన్ కంటెంట్ అధికంగా వినియోగమవుతున్నట్లు పేర్కొంది.
కేపీఎంజీ, ఎరోస్ నవ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో.. రోజుకు 70 నిమిషాల కన్నా ఎక్కువగా ఆన్లైన్ వీడియోలు చూసేందుకే ఉద్యోగులు సమయం కేటాయిస్తున్నట్లు తేలింది. వారానికి 12 సార్లు.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఆన్లైన్ కంటెట్ చూసేందుకు సమయం వెచ్చిస్తున్నట్లు పేర్కొంది.