తెలంగాణ

telangana

ETV Bharat / business

హవాలా కేసులో మాజీ సీఎం మేనల్లుడి ఇంట్లో సోదాలు - వ్యాపారవేత్త రతుల్​ పురీ ఇంట్లో సీబీఐ సోదాలు

బ్యాంకులను మోసం చేసి రూ.787 కోట్ల అక్రమ నగదు చలామణీకి పాల్పడిన ఆరోపణలపై వ్యాపారవేత్త రతుల్​ పురీ ఇంట్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఆయన తండ్రి నివాసం సహా మొత్తం 7 చోట్ల తనిఖీలు చేసింది.

More trouble for Kamal Nath's nephew, CBI raids Ratul Puri's premises
హవాలా కేసులో సీఎం మేనల్లుడి ఇంట్లో సోదాలు

By

Published : Jun 26, 2020, 3:38 PM IST

Updated : Jun 26, 2020, 4:25 PM IST

మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్​ పురీ ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు నిర్వహించింది. ఆయన తండ్రి నివాసం సహా మొత్తం ఏడు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేశారు అధికారులు. తన కంపెనీ పేరిట.. రూ. 787 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు రతుల్​, ఆయన తండ్రి సహా మరికొంతమందిపై ఆరోపణలున్నాయి.

ఇదే కేసు విషయంలో గురువారం కేసు నమోదుచేసినట్లు తెలిపారు సీబీఐ అధికారులు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించి మరీ సోదాలు చేశారు.

సోదాలు చేస్తున్న సీబీఐ అధికారులు

ఇదీ చూడండి:ఆ మాస్టారు చెప్పే 'లౌడ్​ స్పీకర్​ క్లాసు'లకు పిల్లలు ఫిదా

Last Updated : Jun 26, 2020, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details