లాక్డౌన్ నేపథ్యంలో ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (పీఎఫ్ఎంఎస్) కింద మొత్తం 16.01 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీడీ) ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు బదిలీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందుకోసం మొత్తం రూ.36,659 కోట్లు వెచ్చించినట్లు ప్రకటించింది.
కరోనా సాయం కింద ఖాతాల్లోకి రూ.36వేల కోట్లు - ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం
16.01కోట్ల మంది పీఎఫ్ఎంఎస్ లబ్ధిదారులకు డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాలకు రూ 36,659 కోట్ల బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఇప్పటివరకు 19.86 కోట్లమంది లబ్ధిపొందినట్లు తెలిపింది.
19.86కోట్ల మంది పీఎఫ్ఎంఎస్ లబ్ధిదారులకు 36 వేల కోట్లు బదిలీ
అలాగే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఏప్రిల్ 13 వరకు జన్‌ధన్ ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 19.86 కోట్ల మందికి మొత్తం రూ.9,930 కోట్ల మేర ఆర్థిక సాయం చేసినట్లు వివరించింది.