తెలంగాణ

telangana

ETV Bharat / business

సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధిక పన్నెందుకు? - సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధిక పన్నెందుకు?

సెల్‌ఫోన్‌ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే బడ్జెట్‌లో ఉద్దీపనలు ప్రకటించాలని ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలని, సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధికంగా ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించాలని విజ్ఞప్తి చేసింది.

More tax on spare parts than a cellphone? why?
సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధిక పన్నెందుకు?

By

Published : Jan 30, 2020, 7:06 AM IST

Updated : Feb 28, 2020, 11:39 AM IST

దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ అవకాశాలున్న సెల్‌ఫోన్‌ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే బడ్జెట్‌లో చర్యలు ప్రకటించాలని ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలని, కొన్ని విడిభాగాల దిగుమతులపై సుంకాన్ని పెంచాలని, సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధికంగా ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించాలని విజ్ఞప్తి చేసినట్లు ఐసీఈఏ జాతీయ ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో ‘ఈనాడు’తో చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

బడ్జెట్‌ 2020-21 టెలికాం

ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్​

ఎగుమతులకు..ఎగుమతుల ప్రోత్సాహానికి అమలు చేస్తున్న ఎంఈఐఎస్‌ (మర్కండైజ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్రం ఇండియా స్కీమ్‌) స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల మేరకు కొత్త నిబంధనావళి అమల్లోకి తెచ్చేవరకు, సెల్‌ఫోన్‌ ఎగుమతులపై 4 శాతం ప్రోత్సాహకాన్ని కొనసాగించాలి. ఇటీవల తొలగించిన 2 శాతం ప్రోత్సాహకాన్ని, పునరుద్ధరిస్తారనే అంచనాలున్నాయి. తయారీ సంస్థలకు కార్పొరేట్‌ పన్నును 10 శాతానికి పరిమితం చేయాలి. దిగుమతి చేసుకునే వస్తువులపై చెల్లించిన కస్టమ్స్‌ను వాపసు పొందేందుకు ఎగుమతిదార్లకు అమలవుతున్న డ్యూటీడ్రాబ్యాక్‌ కింద పరిమితి ఒక్కో ఫోన్‌కు గరిష్ఠంగా రూ.197 మాత్రమే ఉంది. పెరిగిన ధరల దృష్ట్యా ఈ మొత్తాన్ని రూ.700కు పెంచాలి.

రూ.1,000 కోట్ల నిధి అత్యవసరం: ద్విచక్ర వాహనాలు, జనరిక్‌ ఔషధాల రంగంలో దేశీయ సంస్థలు అంతర్జాతీయంగా ఖ్యాతి గడిస్తున్నాయి. ఈ స్థాయిలో సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలూ రూపుదిద్దుకునేలా సహకరించేందుకు రూ.1,000 కోట్ల నిధిని అత్యవసరంగా ఏర్పాటు చేయాలి.

జీఎస్‌టీ: ప్రస్తుత సెల్‌ఫోన్లకు 12 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. అయితే సెల్‌ఫోన్‌ తయారీకి వినియోగించే విడిభాగాలపై మాత్రం 18 శాతం, 28 శాతం జీఎస్‌టీ వేస్తున్నారు. ఇది సహేతుకం కాదని, సెల్‌ఫోన్‌ స్థాయికి తగ్గించాలి.

తయారీ పెంచేందుకు:లిథియం అయాన్‌ సెల్స్‌పై సుంకాన్ని 5-0 శాతమే విధించాలి. ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని 15 నుంచి 20 శాతానికి, కంప్రెషర్లపై 10 నుంచి 20 శాతానికి, సెట్‌టాప్‌ బాక్స్‌ ఛార్జర్లపై 0 నుంచి 15 శాతానికి పెంచాలి. జాబ్‌వర్క్‌లు సులభతరం చేసేందుకు కంపెనీల మధ్య బదిలీ నిబంధనలను సులభతరం చేయాలి.

గరిష్ఠంగా రూ.4,000 సుంకం: ఖరీదైన స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం కొనసాగిస్తూనే, గరిష్ఠ పరిమితిని రూ.4000కు పరిమితం చేయాలి.
వియత్నాం దిగుమతులపై: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రకారం వియత్నాం నుంచి దిగుమతులు భారీగా పెరిగాయి. వీటిపై పరిశీలన జరిపి దేశీయ పరిశ్రమను ఆదుకునే చర్యలు చేపట్టాలి.

ఇదీ చూడండి:'వృద్ధి పెరగాలంటే సుంకాలు తగ్గించాల్సిందే..!'

Last Updated : Feb 28, 2020, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details