కరోనా సంక్షోభం కారణంగా రుణాలపై మారటోరియాన్ని రెండేళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తెలిపాయి. కరోనా విపత్తుతో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు వివరించాయి.
మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీని మాఫీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు నివేదించాయి. రుణాలపై వడ్డీ విషయంలో న్యాయంగా ఆలోచించాలని కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు.. ఈ పిటిషన్‌పై విచారణను ఎక్కువ ఆలస్యం చేయదలచుకోలేదని పేర్కొంది.