అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్.. భారతదేశ వృద్ధిరేటు అంచనాలను సవరించింది. గతంలో దేశ వృద్ధిరేటు 13.9 శాతంగా ఉంటుందని అంచనా వేసిన మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్.. ప్రస్తుతం దీనిని 9.6 శాతానికి కుదించింది. మాక్రో ఎకనామిక్స్ ఇండియా పేరిట నివేదిక విడుదల చేసింది. కొవిడ్ రెండో దశ.. 2021 ఏడాది వృద్ధి రేటు అంచనాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు పేర్కొంది.
'వృద్ధిరేటు 9.6 శాతానికే పరిమితం!' - భారత దేశ వృద్ధి రేటు
2021కి గాను దేశ వృద్ధిరేటు 9.6కు పరిమితం అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. గతంలో వెలువరించన అంచనాలను సవరిస్తూ తాజాగా మాక్రో ఎకనామిక్స్ ఇండియా పేరిట బుధవారం విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఆర్థిక లోటును పరిమితం చేయాలంటే టీకా పంపిణీ వేగవంతం చేయాలని పేర్కొంది.
జీడీపీ
2021లో 9.6 శాతంగా 2022లో 7శాతంగా వాస్తవ జీడీపీ వృద్ధిరేటు ఉంటుందని అంచనా వేసింది. టీకాల పంపిణీ కార్యక్రమం వేగవంతం, ఆంక్షల సడలింపుల కారణంగా ద్వితీయార్థంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్న మూడీస్.. ఆర్థిక వ్యవస్థ నష్టాలు ఏప్రిల్- జూన్ త్రైమాసికానికే పరిమితం అవుతాయని అంచనా వేసింది.
ఇదీ చూడండి:రూ.5.8వేల కోట్ల 'మాల్యా' షేర్లు విక్రయం