Money Management Tips: మన దగ్గర ఉన్న మిగులు ధనాన్ని సరైన పద్ధతుల్లో పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలను ఆర్జించవచ్చో తెలుసుకుందాం.
నేను నెలకు రూ. 15,000 వరకూ స్టాక్ మార్కెట్లో పెట్టాలని అనుకుంటున్నాను. క్రమం తప్పకుండా షేర్లలో మదుపు చేసేందుకూ అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? మ్యూచువల్ ఫండ్లకన్నా దీని ద్వారా లాభం ఎక్కువగా వస్తుందా?
- సత్యం
క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా షేర్లలోనూ మదుపు చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని సిస్టమేటిక్ ఈక్విటీ ప్లాన్ అంటారు. కనీసం ఏడేళ్లకు పైగా పెట్టుబడిని కొనసాగించగలరు అనే నమ్మకం ఉన్నప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాలి. మీకు స్టాక్ మార్కెట్‌పైన మంచి అవగాహన ఉండి, షేర్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండటం, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించగలిగే అవకాశం ఉన్నప్పుడే దీన్ని ఎంచుకోవాలి. లేదా.. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఉత్తమం. నేరుగా షేర్లలో మదుపు చేసినప్పుడు నష్టభయం అధికంగా ఉంటుంది.
నా వయసు 46 ఏళ్లు. నెలకు రూ.45వేలు వస్తున్నాయి. నేను రూ.కోటి పాలసీ తీసుకునేందుకు వీలవుతుందా? ఎంత వ్యవధికి తీసుకుంటే బాగుంటుంది?
- కుమార్
మీ బాధ్యతలన్నీ తీరేంత వరకూ బీమా పాలసీ రక్షణ ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ బీమా ఉంటే సరిపోతుంది. మీ అవసరాలను బట్టి, దీన్ని నిర్ణయించుకోండి. మీ ఆదాయం, వయసు ఆధారంగా ఎంత బీమా ఇచ్చేందుకు అవకాశం ఉంది అనేది బీమా సంస్థలను బట్టి ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాల కోసం బీమా సంస్థను సంప్రదించండి.
మా అమ్మాయి వయసు 14 ఏళ్లు. మరో 10 ఏళ్ల తర్వాత అవసరాలను దృష్టిలో పెట్టుకొని, నెలకు రూ.25,000 మదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికోసం మా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి?