తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఫేక్​' ఉచ్చులో పడ్డ జనం- 'ఫ్రీ మనీ' కోసం క్యూ - భాజపా

తపాలా కార్యాలయంలో నూతన ఖాతా తెరిస్తే ప్రధానమంత్రి అకౌంట్​ నుంచి నేరుగా డబ్బులు జమవుతాయన్న తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. నమ్మిన కేరళలోని మున్నార్​ ప్రజలు తపాలా కార్యాలయం ఎదుట బారులు తీరారు. పోస్ట్​ ఆఫీస్ అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు నమ్మకపోవడం విడ్డూరం.

'ఫేక్​' ఉచ్చులో పడ్డ జనం- 'ఫ్రీ మనీ' కోసం క్యూ

By

Published : Jul 31, 2019, 11:21 AM IST

Updated : Jul 31, 2019, 12:06 PM IST

సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన ఓ తప్పుడు సమాచారం... కేరళలోని మున్నార్​ తపాలా కార్యాలయం ముందు స్థానిక జనాలు బారులు తీరేలా చేసింది. తపాలా కార్యాలయంలో నూతన ఖాతా తెరిస్తే ప్రధానమంత్రి ఖాతా నుంచి నేరుగా డబ్బులు జమవుతాయన్న తప్పుడు సందేశం ప్రచారం కావడమే ఇందుకు నేపథ్యం.

'ఫేక్​' ఉచ్చులో పడ్డ జనం- 'ఫ్రీ మనీ' కోసం క్యూ

గత కొన్ని రోజులుగా స్థానికులు మున్నార్ తపాలా కార్యాలయం ముందు బారులు తీరుతున్నారు. పోస్ట్​ ఆఫీస్ ఉద్యోగులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రజలు నమ్మడం లేదు. వందలాదిగా జనం బారులు తీరడం వల్ల పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

సోమవారం దేవికులం రెవెన్యూ డివిజన్​ కార్యాలయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రభుత్వం ఉచితంగా భూమి ఇస్తోందన్న తప్పుడు సమాచారంతో చాలా మంది కార్మికులు ఆర్​డీఓ కార్యాలయం ఎదుట బారులు తీరారు. అయితే ఇది తప్పుడు సమాచారం అని సబ్​కలెక్టర్ రేణురాజ్​ స్పష్టం చేశారు.

అవాస్తవాలను ప్రచారం చేసి... ప్రజలను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక భాజపా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో మావోల దాడి.. జవాను మృతి

Last Updated : Jul 31, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details