తెలంగాణ

telangana

By

Published : May 11, 2019, 6:34 PM IST

ETV Bharat / business

ఆయుష్మాన్ భారత్​ భేష్​... కానీ..!

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'మోడీకేర్'​ (ఆయుష్మాన్ భారత్​)లో ఇంకా కొన్ని విషయాల్లో మార్పులు చేయాల్సిన అవసరముందని అమెరికాకు చెందిన సెంటర్​ ఫర్​ గ్లోబల్​ సంస్థ సలహా ఇచ్చింది. పథకం మొదటి సంవత్సర పనితీరు ఆధారంగా ఈ సూచనలు చేసింది సీజీడీ.

ఆయుష్మన్ భారత్

భారత్​లో ఆరోగ్య బీమా సేవలందించే 'ఆయుష్మాన్ భారత్' ఓ గొప్ప పథకమని అమెరికాలోని వాషింగ్టన్​ డీసీ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్​ ఫర్​ గ్లోబల్​ డెవలప్​మెంట్​ (సీజీడీ) పేర్కొంది.

'మోదీ కేర్​'గా ప్రాచుర్యం పొందిన ప్రధాన్​ మంత్రి జన్ ఆరోగ్య యోజన మొదటి సంవత్సరం పని తీరు విశ్లేషణ ఆధారంగా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చింది సీజీడీ.

చికిత్స, ఔషధాల ధరలు అదుపులో ఉంచడం సహా నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉందని సీజీడీ ముఖ్య కార్య నిర్వహణాధికారిణి అమండా గ్లాస్​మన్​ అన్నారు.

"భారత ఆరోగ్య రంగలో మోదీ కేర్​ ఒక మంచి ప్రయత్నం. ప్రాథమిక అంచనాలు మించి ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం 500 మిలియన్ల మందికిపైగా 'మోదీకేర్'​ పరిధిలోకి వస్తారని మేము గుర్తించాం. ఇది చాలా పెద్ద విజయం. కానీ ఇంకా ధరలు అదుపులో ఉంచడం సహా నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది."
-అమండా గ్లాస్​మన్, సీజీడీ సీఈఓ

ABOUT THE AUTHOR

...view details