Mobile broadband index report 2022: మనదేశంలో మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం శరవేగంగా పెరిగిపోతోంది. గత ఐదేళ్లలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వాడేవారి సంఖ్య 34.5 కోట్ల నుంచి 76.5 కోట్లకు ఎగబాకటమే దీనికి నిదర్శనం. సగటున ఒక్కొక్కరు నెలకు 17జీబీ డేటాను వాడుకుంటున్నారు. యువతరమైతే రోజుకు 8 గంటలు ఆన్‌లైన్‌లోనే గడుపుతుండటం.. ఇంటర్నెట్ వాడేవారిలో 90% మంది స్థానిక భాషలకు మొగ్గు చూపుతుండటం విశేషం. నోకియా సంస్థ ఏటా విడుదల చేసే 'మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ రిపోర్టు 2022' చెబుతున్న వివరాలివి. దీని ప్రకారం.. మనదేశంలో 2021లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ డేటా వృద్ధి రికార్డు స్థాయికి చేరుకుంది. 4జీ మొబైల్ డేటా 31% పెరగగా.. నెలవారీ సగటు వినియోగం 26.6% పెరిగింది.
రోజుకు ఎన్ని జీబీల డేటా వాడేస్తున్నారో తెలుసా? - internet users in india
Mobile broadband index report 2022: ప్రస్తుత రోజుల్లో భారత్‌లో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్లలో ఇంటర్నెట్ను ఎక్కుగానే వాడుతున్నారు. సగటున యువతరమైతే రోజుకు 8 గంటలు ఆన్లైన్లో గడుపుతుందని 'మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ రిపోర్టు 2022' తెలిపింది. ఒక్కొక్కరు 17జీబీ డేటాను వాడుతున్నారని ఈ రిపోర్టులో పేర్కొంది.
మొబైల్లో ఇంటర్నెట్ వాడకం
గత సంవత్సరంలో 4 కోట్ల మంది 4జీ సర్వీసును పొందటమో లేదా అప్‌గ్రేడ్ కావటమో చేసుకున్నారు. త్వరలో 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుండటం, వాణిజ్యపరంగా సేవలు ఆరంభం కానున్న నేపథ్యంలో మున్ముందు డిజిటల్ సేవల వాడకంలో తారతమ్యం తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి:మస్క్, జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన అదానీ.. మళ్లీ అగ్రస్థానం అంబానీకే