తెలంగాణ

telangana

ETV Bharat / business

వీధి వ్యాపారులకు మొబైల్‌ యాప్‌

కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ఓ మొబైల్ యాప్​ను ప్రారంభించింది. 'పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి' పేరుతో ఈ మొబైల్ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

Mobile app for street vendors
వీధి వ్యాపారులకు మొబైల్‌ యాప్‌

By

Published : Jul 18, 2020, 8:47 AM IST

వీధి వ్యాపారుల కోసం కేంద్రం మొబైల్‌ యాప్‌ ప్రారంభించింది. మైక్రో క్రెడిట్‌ సదుపాయం నిమిత్తం పీఎం స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మ నిర్భర్‌ నిధి (పీఎంఎస్‌వీఏఎన్‌ఐడీహెచ్‌ఐ) మొబైల్‌ అప్లికేషన్‌ను శుక్రవారం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా ప్రారంభించారు. డిజిటల్‌ టెక్నాలజీని ప్రోత్సహించడం సహా, వీధి వ్యాపారుల రుణ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సులభతరం చేయడానికి ఈ యాప్‌ తీసుకొచ్చినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.

వీధి వ్యాపారులకు పెట్టుబడి రుణాల నిమిత్తం పీఎంఎస్‌వీఏఎన్‌ఐడీహెచ్‌ఐను జూన్‌1న మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఇప్పటికే వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించామని, గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1.54 లక్షల మంది వీధి వ్యాపారులు... రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా 48వేలు అనుమతి పొందాయని పేర్కొంది. 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వశాఖ వివరించింది.

ఇదీ చూడండి:ప్రియురాలిని కలిసేందుకు పాక్​కు పయనం.. కానీ!

ABOUT THE AUTHOR

...view details