సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉన్నా స్మార్ట్ ఫోన్ వాడకం మాత్రం తగ్గడం లేదంటున్నాయి సర్వేలు. ఓ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం పిల్లలు, పెద్దలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతుందన్న వాస్తవాలు తెలిసినా.. అభివృద్ధి చెందుతున్న భారత్‌తో సహా 11 దేశాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారల సంఖ్య మాత్రం పెరుగుతుందని తెలుస్తోంది. దాదాపు 53 శాతం మంది ఫోన్లలో వివిధ రకాల ఆప్స్ వాడుతున్నట్లు వెల్లడైంది. అందులో 64 శాతానికి పైగా కేవలం 7 సమాచార యాప్స్ ఉన్నట్లు పేర్కొంది.
భారత్, కొలంబియా, వెనిజులా, మెక్సికో, దక్షిణాఫ్రికా, కెన్యా, వియత్నాం, ఫిలిప్పీన్స్, లెబనాన్, జోర్డాన్, ట్యూనిషియా దేశాల్లోని 28,122 యువతపై ఈ సర్వే నిర్వహించారు. ఈ దేశాల్లోని యువతలో 62శాతం మంది ఫేస్‌బుక్‌ను వాడుతుండగా.. 47 శాతం మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు.
ప్యూ పరిశోధనా సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం 10మందిలో 9 మంది తమ ప్రియమైన వారితో సమాచారాన్ని పంచుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుందని తెలిపారు. మరో 10 మందిలో 8మంది వార్తలు, ముఖ్య సమాచారం తెలుసుకునేందుకు వాడతామని స్పష్టం చేశారు.