పెట్రో ధరలు రికార్డ్ స్థాయికి చేరాయంటూ కేంద్రాన్ని విమర్శించడం తగదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు విధిస్తాయే తప్ప ధరలను నిర్ణయించవని ప్రధాన్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని.. చమురు సంస్థలే ధరలను నిర్ణయిస్తాయని తెలిపారు. పెట్రో ధరల పెంపునకు కేంద్రం కారణమని ప్రచారం చేయడం తగదన్నారు ధర్మేంద్ర.
"గత 300 రోజుల్లో 60 రోజుల పాటు చమురు ధరలు పెరిగాయి. 7 రోజుల పాటు పెట్రోల్, 21 రోజులు డీజిల్ ధరలు తగ్గించాం. దాదాపు 250 రోజులు ధరలు యథాతథ స్థితిలోనే ఉన్నాయి. కనుక ధరలు ఆకాశాన్నంటాయి, చుక్కల్ని తాకాయి అని ప్రచారం చేయడం తగదు."
- ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం శాఖ మంత్రి