6 Airbags: ప్రయాణికుల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఎనిమిది మంది ప్రయాణించే కార్లలో తప్పనిసరిగా ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రయాణించే కార్లలో కూడా భద్రత మెరుగవుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆమోదించినట్లు మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.
2019 జులై 1 నుంచి డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్ నిబంధనను తప్పనిసరి చేయగా, 2022 జనవరి 1 నుంచి అన్ని కార్లలో 2 ఎయిర్‌బ్యాగ్‌ల (డ్రైవరు, ముందు సీటు ప్రయాణికునికి) ఏర్పాటు తప్పనిసరి చేశారు. ఇటీవలే ఎనిమిది మంది ప్రయాణించే కార్లలో ధర, వేరియంట్‌తో సంబంధం లేకుండా అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌ల నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు గడ్కరీ ట్వీట్ చేశారు.