తెలంగాణ

telangana

ETV Bharat / business

'మైక్రోసాఫ్ట్- టిక్​టాక్ ఒప్పందం కష్టమే' - US software giant

దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్, ప్రముఖ యాప్​ టిక్​టాక్​ మధ్య ఒప్పందం కష్టమని చైనాకు చెందిన ఓ అధికారిక పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది. కష్టాల్లో కంపెనీని అతితక్కువ ధరకు దక్కించుకోవాలని ప్రయత్నించటమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

TIkTOk
మైక్రోసాఫ్ట్- టిక్​టాక్

By

Published : Aug 11, 2020, 11:59 AM IST

Updated : Aug 11, 2020, 4:17 PM IST

ప్రముఖ చైనా యాప్ టిక్​టాక్​ను దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అభిప్రాయపడింది. 20 శాతం కన్నా ఎక్కువ అవకాశం లేదని తెలిపింది.

ప్రస్తుతం కష్టాల్లో ఉన్న కంపెనీని తక్కువ ధరకు దక్కించుకోవాలని ప్రయత్నించటమే ఇందుకు కారణమని పేర్కొంది. సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​తోనూ ఒప్పందం సాధ్యమయ్యేలా కనిపించట్లేదని వ్యాఖ్యానించింది.

యాప్​పై నిషేధం..

టిక్​టాక్​ను భారత్​ నిషేధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ కూడా ఆ దిశగా అడుగులు వేశారు. 45 రోజుల్లో యాప్​ను అమెరికాలో నిషేధించేలా కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

చట్టం ప్రకారం చర్యలు..

ఈ అంశంపై చట్ట ప్రకారం తేల్చుకుంటామని టిక్​టాక్ స్పష్టం చేసింది. సంస్థ స్పందన కోరకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్​లో పేర్కొనే అవకాశం ఉంది.

Last Updated : Aug 11, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details